ఆకాష్ సినిమా లాంచ్ డీటెయిల్స్

Sunday,September 23,2018 - 05:02 by Z_CLU

లేటెస్ట్ గా ‘మెహబూబా’ సినిమాతో ప్రేక్షకులకు హీరోగా పరిచయమైన ఆకాష్ పూరి నెక్స్ట్ సినిమాతో రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టేజిలో ఉన్న ఈ సినిమా ఈ నెలాఖరున లాంచ్ కానుంది. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాతో పూరి జగన్నాథ్ టీంలో వర్క్ చేస్తున్న అనిల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. పూరి జగన్నాథ్ కథ-మాటలు అందిస్తున్నాడు.

ప్రస్తుతం ఈ సినిమా కోసం న్యూ లుక్ ట్రై చేస్తున్నాడు ఆకాష్…ఈ సినిమాతో ఎలాగైనా ఆకాష్ ను ఎస్టాబిలిష్ చేయాలనీ ట్రై చేస్తున్నాడు పూరి…పూరి టూరింగ్ టాకీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా అక్టోబర్ నుండి సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు సంబంధించి కాస్ట్ & క్రూ డీటెయిల్స్ తెలియాల్సి ఉంది.