నాగార్జున సరసన హీరోయిన్ ఫిక్స్

Thursday,April 12,2018 - 11:59 by Z_CLU

కింగ్ నాగార్జున ఓ మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం సెకెండ్ షెడ్యూల్ నడుస్తోంది. నాని, నాగ్ మధ్య కొన్ని సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో తాజాగా హీరోయిన్లను ఫిక్స్ చేశారు.

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ సరసన ఆకాంక్ష సింగ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఇక నాని సరసన హీరోయిన్ గా రష్మికను ఇప్పటికే ఫిక్స్ చేశారు. సో.. ఈ సినిమాలో హీరోయిన్లు ఫిక్స్ అవ్వడంతో ఇక సినిమా షూటింగ్ ను పరుగులు పెట్టించబోతున్నారు.

వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. నిజానికి ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ తోనే ప్రారంభమైంది. తర్వాత అమెరికాలో మరికొన్ని ట్యూన్స్ ఫైనల్ చేశారు.