Valimai వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

Wednesday,April 20,2022 - 03:44 by Z_CLU

Ajith’s ‘Valimai’ World Television on April 24th

అజిత్ లేటెస్ట్ బ్లాక్ బస్టర్ ‘వలిమై‘ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి  జీ తెలుగులో ఏప్రిల్ 24న వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా రాబోతుంది. హెచ్ వినోద్ డైరెక్షన్ లో ఫ్యామిలీ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో మెస్మరైజ్ చేసే యాక్షన్ ఎపిసోడ్స్ తో పాటు మంచి సెంటిమెంట్ డ్రామా కూడా ఉంది.

ముఖ్యంగా అజిత్ విలన్స్ ని హై వే పై ఎటాక్ చేసే యాక్షన్ బ్లాక్ సినిమాకే హైలైట్. ఆ యాక్షన్ సీక్వెన్స్ సినిమా స్టాండర్డ్స్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళి ‘యాక్షన్ ఎంటర్టైనర్ ఆఫ్ ది ఇయర్’ అంటూ చూసిన  వారందరూ మాట్లాడుకునేలా చేసింది. ఈ యాక్షన్ సీక్వెన్స్ కోసం యూనిట్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. వారి కష్టం గురించి తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. సినిమాలో బైక్ రేస్ లతో వచ్చే సీక్వెన్స్ ను చూస్తూ వావ్ అనాల్సిందే. అలాగే  హీరో కార్తికేయ ఫర్ ది ఫర్ట్ టైం తమిళ్ లో నటించాడు. ఇందులో అజిత్ ని డీ కొట్టే పవర్ ఫుల్ విలన్ పాత్రలో కనిపిస్తాడు కార్తికేయ.

అన్ని ఎలిమెంట్స్ తో కూడిన ఈ యాక్షన్ డ్రామాను సిల్వర్ స్క్రీన్ పై చూడటం మిస్ అయిన వారు స్మాల్ స్క్రీన్ మీద చూసి ఎంజాయ్ చేయాల్సిందే. So DONT MISS IT.

VALIMAI ఏప్రిల్ 24 న జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics