Valimai ZEE5 - ఓటీటీలోనే సరికొత్త రికార్డ్

Sunday,March 27,2022 - 12:02 by Z_CLU

Ajith’s Valimai film sets a record on ZEE5, clocks 100M streaming minutes

చలనచిత్ర ప్లాట్‌ఫామ్‌ లలోనే ఇప్పటివరకు ఎవరికీ రానటువంటి అతిపెద్ద ఓపెనింగ్స్ తో దూసుకుపోతున్న ఫుల్ యాక్షన్ ఫ్యామిలీ ఏంటర్ టైనర్ “వలీమై”. “ZEE5 లో ప్రత్యేకంగా స్ట్రీమింగ్ అవుతూ తెలుగు, తమిళం, కన్నడ మరియు హిందీలో అందుబాటులో కి వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతూ.. అభిమానుల సందడితో దూసుకుపోతున్నందుకు ZEE5 టీం ఎంతో సంతోషంగా ఉంది.

మొట్టమొదటిసారిగా, ‘వలీమై సినిమా’ నుండి తొలగించబడిన సీన్స్ ఇప్పుడు ప్రసారం చేయబడుతున్నాయి. ఇందులో అజిత్ కుమార్ IPS ఆఫీసర్ అర్జున్‌ పాత్రలో నటించగా, హుమా ఖురైషీ ముఖ్య పాత్రలో నటించారు. ZEE5లో స్ట్రీమింగ్‌ను అవుతున్న సందర్భంగా అజిత్‌ కుమార్‌ గౌరవార్ధం ZEE5` సంస్థ చెన్నైలోని వైయంసీఏ సర్కిల్‌లో 10,000 అడుగుల పొడవైన అతిపెద్ద పోస్టర్‌ను ఏర్పాటు చేసింది. భారతదేశం లో ఏ ఓటిటి సంస్థ ఇటువంటి అతి పెద్ద పోస్టర్ ను ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. భారతీయ స్ట్రీమింగ్ చరిత్రలో ఇది తిరుగులేని రికార్డు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అజిత్‌ అభిమానులతో పాటు, భారతీయ ప్రేక్షకుల కోసం బ్లాక్‌బస్టర్‌ హిట్‌ చిత్రం ‘వలీమై’ మా జీ`5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ విడుదలైన అతి తక్కువ సమయంలోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ నిమిషాలను పూర్తి చేసుకొని విజయవంతంగా రన్ అవుతూ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొడుతున్నందుకు చాలా గర్వంగా ఉంది అన్నారు.

valimai zee5 ajith

హెచ్.వినోత్ రచన మరియు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్‌తో కలిసి బేవ్యూ ప్రాజెక్ట్ ఎల్‌ఎల్‌పికి చెందిన బోనీ కపూర్ నిర్మించారు. ఈ చిత్రంలో హ్యూమా ఖురేషి హీరోయిన్ గా నటించగా, టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ పవర్ ఫుల్ విలన్ గా కనిపించాడు. యువన్ శంకర్ రాజా సంగీతం సమకూర్చగా, నీరవ్ షా సినిమాటోగ్రఫీ అందించారు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics