RRR లో ఇద్దరికీ ఒకరే గురువు...

Saturday,October 12,2019 - 01:40 by Z_CLU

రియల్ లైఫ్ లో గురువు కాదు.. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘RRR’ సినిమాలో. నిన్న మొన్నటి వరకు ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్ ప్లే చేస్తున్న క్యారెక్టర్ పై జస్ట్ క్యూరియాసిటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు చిన్నగా ఈ క్యారెక్టర్ చుట్టూ ఇంట్రెస్టింగ్ స్పెక్యులేషన్స్ చక్కర్లు కొడుతున్నాయి.

మేకర్స్ నుండి అఫీషియల్ గా కన్ఫర్మేషన్ లేదు కానీ, అజయ్ దేవ్ గన్ ఈ ఇద్దరికీ గురువులా నటిస్తున్నాడనే టాక్ సోషల్ మీడియాలో హీట్ ని జెనేరేట్ చేస్తుంది. అటు అల్లూరి సీతా రామరాజు, ఇటు కొమురం భీమ్ లిద్దరినీ, బ్రిటీష్ వారిపై తిరగబడేలా ఇన్స్ పైర్ చేసేలా ఈ క్యారెక్టర్ ఉండబోతుందని తెలుస్తుంది. వీరిద్దరూ యుద్ధ విద్యలు నేర్చుకునేది కూడా ఈ క్యారెక్టర్ దగ్గరే అని తెలుస్తుంది.

ఈ టాక్ ఎంతవరకు అఫీషియల్ గా ట్రాన్స్ ఫామ్ అవుతుందో తెలీదు కానీ, రాజమౌళి అజయ్ దేవ్ గన్ ని ఏ క్యారెక్టర్ లో ప్రెజెంట్ చేసినా, పవర్ ఫుల్ గా ప్రెజెంట్ చేయడం గ్యారంటీ అనే నమ్ముతున్నారు ఫ్యాన్స్.

D.V.V. దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో ఆలియాభట్ రామచరణ్ సరసన నటిస్తుంది. NTR సరసన నటిస్తున్న హాలీవుడ్ హీరోయిన్ డీటేల్స్ ఇంకా రివీల్ చేయలేదు మేకర్స్. కీరవాణి ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్.