RRR ఆ ఎపిసోడ్ పూర్తి చేయబోతున్న రాజమౌళి

Monday,November 30,2020 - 12:13 by Z_CLU

కరోన ఎఫెక్ట్ తో వాయిదా పడిన RRR షూట్ మళ్ళీ మొదలైన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు యాబై రోజుల పాటు షూట్ చేసి కీలక సన్నివేశాలను ఫినిష్ చేసిన SS Rajamouli ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ను షూట్ చేయడానికి రెడీ అవుతున్నాడు

. నేటి నుండి Ajay Devgan ఈ సినిమా షూట్ లో పాల్గొనబోతున్నాడు. లాక్ డౌన్ కంటే ముందే అజయ్కి సంబందించి కొంత పోర్షన్ ఫినిష్ చేసారు. ప్రస్తుతం అజయ్ దేవగన్ , శ్రియా శరన్ లపై  ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. డిసెంబర్ ఎండింగ్ వరకు అజయ్ కి సంబంధించి సన్నివేశాలు పూర్తి చేయాలని భావిస్తున్నాడట జక్కన్న.

Jr NTR , Ram Charan కలిసి నటిస్తున్న ఈ మోస్ట్ ఎవైటింగ్ మల్టీ స్టారర్ సినిమాను DVV Entertainments బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నాడు. హిస్టారికల్, ఫిక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో Alia Bhatt , Olivia Morris హీరోయిన్స్ గా నటిస్తున్నారు. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Also Check RRR కి అమీర్ ఖాన్ వాయిస్ ఓవర్