RRR సెట్స్ పైకి అజయ్ దేవగన్

Tuesday,January 21,2020 - 12:48 by Z_CLU

బాలీవుడ్ అజయ్ దేవగన్, RRR సెట్స్ పైకి వచ్చాడు. ఈ మూవీకి సంబంధించి నిన్నట్నుంచి కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయింది. ఇవాళ్టి నుంచి అజయ్ దేవగన్ పై సన్నివేశాలు తీయబోతున్నారు.

‘మీ రాకకోసం మేము కూడా ఎంతో ఉత్సాహంతో ఎదురుచూస్తున్నాము, మీకు ఇదే మా ఆహ్వానం’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్, దర్శకుడు రాజమౌళితో అజయ్ దేవగన్ దిగిన ఫోటోలను పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ షెడ్యూల్ వికారాబాద్ అడవుల్లో జరుగుతోంది.

సినిమాకు సంబంధించి ఇప్పటికే 60శాతానికి పైగా షూటింగ్ పూర్తయింది. హీరోయిన్ అలియా భట్, నటుడు అజయ్ దేవగన్ కోసం వెయిటింగ్. ఈరోజు నుంచి అజయ్ దేవగన్ వస్తున్నాడు. అలియా కూడా వస్తే RRR ఓ కొలిక్కి వస్తుంది. ఈ షెడ్యూల్ కంప్లీట్ అయిన తర్వాత రిలీజ్ డేట్ పై ఓ క్లారిటీ వస్తుంది.

హిస్టారికల్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కుతున్న RRRలో చరణ్-ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్నారు. అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. చరిత్రలో అస్సలు కలవని ఈ రెండు పవర్ ఫుల్ పాత్రలు కలిస్తే ఎలా ఉంటుందనే ఫిక్షనల్ ఐడియాతో ఈ సినిమా వస్తోంది.