Driver Jamuna - ట్రయిలర్ రివ్యూ

Friday,July 08,2022 - 11:50 by Z_CLU

తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న నటి ఐశ్వర్య రాజేష్. డిఫరెంట్ రోల్స్ చేసే ఈ హీరోయిన్, ఇప్పుడు డ్రైవర్ జమున పేరుతో మరో డిఫరెంట్ మూవీతో ప్రేక్షకులని అలరించడానికి సిద్ధమౌతోంది. ఔట్ అండ్ ఔట్ రోడ్ మూవీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పా.కిన్‌స్లిన్‌ దర్శకత్వం వహిస్తుండగా 18 రీల్స్‌పై ఎస్.పి.చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమా థియేట్రికల్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు.

ఇంట్లో వారికి ఇష్టం లేకపోయినా క్యాబ్ డ్రైవింగ్ ని వృత్తిగా మార్చుకుంటుంది జమున. ఒక రైడ్ ఆమె జీవితాన్ని పూర్తిగా మారేస్తుంది. ఆమె క్యాబ్‌లో ప్రయాణించే ప్రయాణికులకు నేర చరిత్ర ఉండడం, వారి ప్రాణాలకు ముప్పు పొంచి ఉండడంతో జమున కూడా ప్రమాదంలో పడటం.. చివరికి ఈ ప్రమాదం నుండి జమున ఎలా బయటపడింది అనేది కథలో కీలకాంశం.

ట్రైలర్‌ని బట్టి చూస్తే, ఈ చిత్రం థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కింది. ఐశ్వర్య రాజేష్ నటన ట్రయిలర్ ఆకట్టుకునేలా ఉంది. కెమెరా పనితనం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అవుట్ స్టాండింగ్ గా ఉన్నాయి. ఐశ్వర్య రాజేష్ ప్రతి ఒక్క షాట్‌ను ఎటువంటి డూప్‌ లేకుండా నటించిందట. ఈ చిత్రంలో తన పాత్ర వాస్తవానికి దగ్గరగా ఉందేందుకు స్వయంగా క్యాబ్ నడిపిందట ఈ బ్యూటీ.

జిబ్రాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి కి గోకుల్ బెనోయ్ సినిమాటోగ్రాఫర్ గా, ఆర్ రామర్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల చేస్తున్నారు.