మరో ఫిమేల్ ఓరియంటెడ్ కథలో ఐశ్వర్య

Saturday,March 07,2020 - 11:54 by Z_CLU

మనకు చాలామంది హీరోయిన్లున్నారు. కానీ ఫిమేల్ ఓరియంటెడ్ కథలు చేసే హీరోయిన్లు మాత్రం చాలా తక్కువ మంది ఉన్నారు. రీసెంట్ గా ఆ లిస్ట్ లోకి చేరిన ముద్దుగుమ్మ ఐశ్వర్యరాజేష్. ఈ మధ్య కాలంలో విజయ్‌ దేవరకొండతో కలిసి ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా నటించి మంచి మార్కులు కొట్టేసింది. ఇప్పుడు ఫిమేల్ ఓరియంటెడ్ మూవీ చేయబోతోంది.

దర్శకుడు పా రంజిత్ నిర్మాతగా మారి ఓ సినిమా చేయబోతున్నాడు. ఇదొక విమెన్ సెంట్రిక్ మూవీ. ఇందులో లీడ్ రోల్ కోసం ఐశ్వర్యను తీసుకున్నారు. ఈ సినిమాకి సతీష్‌ దర్శకత్వం వహించనున్నాడు. కోలీవుడ్ లో ఐశ్వర్య రాజేష్‌కి మంచి క్రేజ్ ఉంది. ఇప్పుడు తెలుగులో కూడా క్రేజ్ తెచ్చుకోవడంతో ఈ సినిమాను ఒకేసారి రెండు భాషల్లో తీస్తారట.

భీమినేని శ్రీనివాసరావు దర్శకత్వంలో వచ్చిన ‘కౌసల్య కృష్ణమూర్తి’లో మహిళా క్రికెటర్‌గా కనిపించింది. ప్రస్తుతం నాని సరసన ‘టక్‌ జగదీష్‌’ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది ఐశ్వర్య.