డైరెక్షన్ చేయనున్న ఐశ్వర్యారాయ్

Friday,August 03,2018 - 06:41 by Z_CLU

ఏజ్ పెరుగుతున్నా ఫ్యాన్స్ లో ఐశ్వర్యా రాయ్ కి ఉన్న క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. దానికి తగ్గట్టుగానే ఐశ్వర్య కూడా ఎప్పటికప్పుడు డిఫెరెంట్ సినిమాలతో మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఈ రోజు రిలీజైన ‘ఫ్యానీ ఖాన్’ లో కూడా సూపర్బ్ పర్ఫామెన్స్ తో ఇంప్రెస్ చేసిన ఐశ్వర్య త్వరలో డైరెక్టర్ గా మెగా ఫోన్ పట్టనుంది. ఈ విషయాన్నీ స్వయంగా తానే రివీల్ చేసింది.

ఫ్యానీ ఖాన్ ప్రమోషన్స్ లో భాగంగా రీసెంట్ గా బాలీవుడ్ మీడియాతో మాట్లాడిన ఐశ్వర్యా త్వరలో డైరెక్షన్ చేయనున్నట్టు చెప్పుకుంది. కరెక్ట్ టైమ్ చూసుకుని ఈ సినిమాకి సంబంధించి తక్కిన డీటేల్స్ ని అనౌన్స్ చేస్తానని చెప్పిన ఐశ్వర్యా, తన దర్శకత్వంలో రాబోయే సినిమాతో తానేంటో అందరికీ తెలుస్తుందని చెప్పుకుంది.

అటు మాడలింగ్ లో, ఆ తరవాత గొప్ప నటిగా అన్ లిమిటెడ్ హైట్స్ ని చూసిన ఐశ్వర్యా , డైరెక్టర్ గా కూడా అదే రేంజ్ లో సక్సెస్ అవ్వడం గ్యారంటీ అని ఫీలవుతున్నారు ఫ్యాన్స్. మరి ఐశ్వర్య డైరెక్టర్ గా తన డెబ్యూ మూవీ డీటేల్స్ ని ఎప్పుడు అనౌన్స్ చేస్తుందో చూడాలి.