గ్రాండ్ గా జరగనున్న ‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంచ్

Thursday,December 14,2017 - 05:57 by Z_CLU

డిసెంబర్ 19 న గ్రాండ్ గా ఆడియో లాంచ్ కి రెడీ అవుతుంది ‘అజ్ఞాతవాసి’ సినిమా. ఇప్పటికే రిలీజైన 2 సాంగ్స్ మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్టులో ఫేవరేట్ ప్లేస్ ని ఆక్యుపై చేసుకుంటే, మరో ఐదు రోజుల్లో రిలీజ్ కానున్న సాంగ్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో సరికొత్త జోష్ ని నింపుతున్నాయి.

డిసెంబర్ 16 న ఈ మూవీ టీజర్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్న సినిమా యూనిట్, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ ప్రాసెస్ జరుపుకుంటుంది. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ ఇమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది.

సంక్రాంతి కానుకగా రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఖుష్బూ కీ రోల్ ప్లే చేసింది. కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యువేల్ హీరోయిన్స్ గా నటించారు. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాని హారిక & హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై S. రాధాకృష్ణ నిర్మిస్తున్నాడు.