వీకెండ్ ఎట్రాక్షన్ గా అజ్ఞాతవాసి ట్రయిలర్

Wednesday,January 03,2018 - 10:39 by Z_CLU

పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న అజ్ఞాతవాసి సినిమాపై ఎంత బజ్ క్రియేట్ అవ్వాలో అంతకంటే ఎక్కువే నడుస్తోంది. రీసెంట్ గా రిలీజైన కొడకా కోటేశ్వరరావు సాంగ్ తో అజ్ఞాతవాసిపై అంచనాలు డబుల్ అయ్యాయి. ఇప్పుడా ఎక్స్ పెక్టేషన్స్ ను మరింత పీక్స్ కు తీసుకెళ్లబోతున్నారు. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా అజ్ఞాతవాసి ట్రయిలర్ ను విడుదల చేయబోతున్నారు.

అజ్ఞాతవాసి సినిమాకు సంబంధించి ఇప్పటికే టీజర్ రిలీజైంది. ఇప్పటికీ ఆ టీజర్ కు యూట్యూబ్ లో హిట్స్ వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దానికి కొనసాగింపుగా ట్రయిలర్ కూడా వస్తోంది. ఇప్పటికే ట్రయిలర్ వర్క్ పూర్తయింది. ముహూర్తం ఫిక్స్ చేసి విడుదల చేయడమే ఆలస్యం.

త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అజ్ఞాతవాసి సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న థియేటర్లలోకి రానుంది. కీర్తి సురేష్, అను ఎమ్మాన్యుయేల్ హీరోయిన్లు. హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మించారు.