అజ్ఞాతవాసి ట్రయిలర్ రివ్యూ

Sunday,January 07,2018 - 09:50 by Z_CLU

మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ అజ్ఞాతవాసి ట్రయిలర్ రిలీజైంది. నిన్న అర్థరాత్రి విడుదలైన ఈ ట్రయిలర్ కు రికార్డు వ్యూస్ వస్తున్నాయి. పవన్ మేనరిజమ్స్, అతడి స్టయిల్ ట్రయిలర్ లో ఎలివేట్ అయ్యాయి.

టీజర్ తో ఇప్పటికే సెన్సేషన్ క్రియేట్ చేసింది అజ్ఞాతవాసి. ఇప్పుడు ట్రయిలర్ తో ఆ సంచలనాల్ని కొనసాగిస్తోంది. టీజర్ కాస్త క్లాసికల్ గా అనిపించినా.. ట్రయిలర్ మాత్రం పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో నిండిపోయింది. రొమాన్స్, కామెడీ, యాక్షన్, డైలాగ్స్.. ఇలా అన్నీ ఉన్నాయి. కీలక పాత్ర పోషించిన ఆది పినిశెట్టిని కూడా ట్రయిలర్ లో చూపించారు.

అను ఎమ్మాన్యుయేల్, కీర్తిసురేష్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా ఈ బుధవారం థియేటర్లలోకి రానుంది అజ్ఞాతవాసి.