అజ్ఞాతవాసి ఆడియో రివ్యూ

Wednesday,December 20,2017 - 12:47 by Z_CLU

పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ ఆడియో లాంచ్ నిన్న గ్రాండ్ గా జరిగింది. అనిరుద్ కంపోజ్ చేసిన మ్యూజిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో మోస్ట్ ట్రెండింగ్ ఎలిమెంట్ లా మారింది. నిన్న రిలీజైన అజ్ఞాతవాసి పాటలపై ఎక్స్ క్లూజివ్ రివ్యూ…

ధగధగమనే : సినిమాలో హీరో క్యారెక్టర్ ఎలివేట్ చేసే సాంగ్. అనిరుద్ మార్క్ అనే కంటే ఈ సాంగ్ విషయంలో త్రివిక్రమ్ మార్క్ అనే చెప్పాలి. తన ప్రతి సినిమాలో ఇలాంటి సాంగ్ ని ప్లాన్ చేసుకోవడం త్రివిక్రమ్ రెగ్యులర్ స్టైల్ అయితే, ఆ స్టైల్ ని సరికొత్తగా ప్రెజెంట్ చేశాడు అనిరుద్. శ్రీమణి రాసిన ఈ పాటని స్వయంగా అనిరుద్ పాడాడు.

బైటికొచ్చి చూస్తే : ఈ సాంగ్ పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పరిచయమే. మూవీకి సంబంధించి మొట్టమొదట విడుదలైన పాట ఇది. యూత్ ఇప్పటికే దీనికి కనెక్ట్ అయిపోయారు. చిన్న చిన్న పదాలతో శ్రీమణి రాసిన లిరిక్స్ అదుర్స్ అనిపించుకున్నాయి. ఈ పాటని కూడా అనిరుద్ పాడాడు.

స్వాగతం కృష్ణ :  ‘మధురాపురి సదనా’ అంటూ బిగిన్ అయ్యే క్లాసికల్ సాంగ్. అత్తారింటికి దారేది సినిమాలో దేవ దేవం పాట తరహాలోనే ఈ సినిమాలో కూడా ఇలా క్లాసికల్ సాంగ్ పెట్టారు. ఇది కూడా సిచ్యువేషనల్ సాంగే. నిరంజన రమణన్ పాడిన ఈ సాంగ్ తోనే టీజర్ స్టార్ట్ అయింది. శ్రీ వెంకటసుబ్బ అయ్యర్ రాసిన కృతుల నుంచి దీన్ని తీసుకున్నారు.

గాలి వాలుగా : పవణ్ కళ్యాణ్, కీర్తి సురేష్ కాంబినేషన్ లో ఉండే రొమాంటిక్ సాంగ్ ఇది. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం ఈ పాటకు ఓ కొత్త అందాన్ని తీసుకొస్తే, అనిరుధ్ కంపోజిషన్ ఆ సాహిత్యానికి ఓ మత్తు ఇచ్చింది. ఈ పాట వింటే ఇందులో ప్రత్యేకత అర్థమౌతుంది. రెగ్యులర్ గా సాగే తెలుగు పాట కంపోజిషన్ కు భిన్నంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే హాలీవుడ్ లో ప్రస్తుతం పాపులర్ అయిన ఫ్రీ-స్టయిల్ కంపోజిషన్ ఆధారంగా ఈ పాటకు బాణీకట్టాడు అనిరుధ్. తనే స్వయంగా పాడాడు కూడా.

AB ఎవరో నీ బేబీ: త్రివిక్రమ్ హీరో ఇద్దరమ్మాయిల మధ్య ఎప్పుడూ ఇబ్బంది పడలేదు.  ఈ సాంగ్ లిరిక్స్ ని కాస్త జాగ్రత్తగా ఫాలో అయితే ఈ సాంగ్ ఇలాంటి సిచ్యువేషన్ లోనే ఉందనిపిస్తుంది. నకాష్ అజీజ్, అర్జున్ చండీ పాడిన ఈ సాంగ్ కి శ్రీమణి లిరిక్స్ రాశాడు.

జీ సినిమాలు రివ్యూ

నిన్న రిలీజ్ అయిన ఆల్బమ్ లో మొదటి పాట, ఈ ఆఖరి పాట మాత్రమే ఆడియన్స్ కు కొత్త. వీటితో పాటు క్రిస్మస్ కానుకగా స్వయంగా పవన్ పాడిన పాటను విడుదల చేయబోతున్నారు. ఓవరాల్ గా నిన్న రిలీజైన పాటలన్నీ మాస్ కు దూరంగా, క్లాసికల్ టచ్ తో ఉన్నాయి. అన్నీ ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేసేవే.