‘అజ్ఞాతవాసి’ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్

Tuesday,November 21,2017 - 01:14 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ అవేటెడ్ మూవీ ‘అజ్ఞాతవాసి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా ఫైనల్ షెడ్యూల్ ని ఈ నెల 27 నుంచి బిగిన్ చేయనుంది. అయితే షూటింగ్ తో పాటు, ఈ సినిమా ఫస్ట్ లుక్ పై కూడా ఫోకస్ పెట్టిన సినిమా యూనిట్, ఈనెల 26 లేదా 27న రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ తో పాటు అనూ ఇమ్మాన్యువెల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. అనిరుధ్ ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజర్. రీసెంట్ గా రిలీజైన ‘బయటికొచ్చి చూస్తే’ సాంగ్, బ్లాక్ బస్టర్ సింగిల్ అనిపించుకోవడమే కాదు, సినిమాపై క్రియేట్ అయి ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ ని నెక్స్ట్ లెవెల్ లో నిలబెట్టాయి. ఇక ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయితే సినిమాపై హై ఎండ్ డిమాండ్ క్రియేట్ అవ్వడం గ్యారంటీ. ఈ సినిమా హారిక & హాసినీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెరకెక్కుతుంది.