స్మాల్ గ్యాప్ తర్వాత

Monday,October 03,2016 - 02:49 by Z_CLU

తెలుగులో యువకుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భూమిక పవన్ కళ్యాణ్ సరసన ‘ఖుషి’ సినిమాలో నటించి కుర్రాళ్ళ గుండెల్ని కొల్లగొట్టేసింది. ఒక్కడు, మిస్సమ్మ, సింహాద్రి, స్నేహమంటే ఇదేరా లాంటి సినిమాలతో తనకంటూ తెలుగు ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.

  sushant_2_1475138713

     ఎప్పుడో 2014 లో జగపతి బాబుతో ‘ఏప్రిల్ ఫూల్’ లో నటించిన భూమిక మళ్ళీ తెలుగు తెరపై కనిపించలేదు. రెండేళ్ళ లాంగ్ గ్యాప్ తరవాత M.S. ధోని సినిమాలో ధోనికి అక్కలా నటించి మంచి మార్కులు కొట్టేసింది. పాత్రకు ప్రాధాన్యం ఉంటేనే కానీ నటించడానికి ఇష్టపడని భూమిక… హీరోయిన్ గా కాకున్నా… మంచి పాత్రలు దొరికితే క్యారెక్టర్ రోల్స్ చేయడానికి కూడా సిద్ధమని ధోనీ సినిమాతో చెప్పకనే చెప్పింది.