'సాహో' తర్వాతే అంటున్న ప్రభాస్ ?

Sunday,August 26,2018 - 10:06 by Z_CLU

ప్రస్తుతం ‘సాహో’ షూటింగ్ తో బిజీ గా ఉన్నాడు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. ఈ సినిమాతో వచ్చే ఏడాది థియేటర్స్ లోకి రానున్న ప్రభాస్ ప్రస్తుతం తన ఫోకస్ అంతా ‘సాహో’ మీదే పెట్టాడు. బాహుబలి తర్వాత నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు ప్రభాస్. అయితే లేటెస్ట్  గా ప్రభాస్ పెళ్లి పై మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ మధ్య ‘బాహుబలి’ తర్వాతే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చిన యంగ్ రెబల్ స్టార్ ఆ మాటను గాలికొదిలేసిన విషయం తెలిసిందే . అయితే ప్రస్తుతం సాహో తర్వాత పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ప్రభాస్ ఉన్నట్లు తెలుస్తుంది. ఇటివలే ఈ విషయాన్ని తన సన్నిహితులతో కూడా పంచుకున్నట్లు సమాచారం.

ఇప్పటికే పెదనాన్న కృష్ణం రాజు ప్రభాస్ కి పిల్లను చూసే పనిలోనే ఉన్నాడట. ఇక ఇప్పటి వరకూ పెళ్లి పై ఎలాంటి క్లారిటీ ఇవ్వకుండా తప్పించుకుంటున్న ప్రభాస్ తన పెళ్లి గురించి ఎప్పుడు నోరిప్పుతాడో..చూడాలి.