‘మజిలీ’ తరవాత మళ్ళీ జోడీగా – కండిషన్స్

Wednesday,May 01,2019 - 02:02 by Z_CLU

‘మజిలీ’ తరవాత చైతూ, స్యామ్ మళ్ళీ జోడీ కట్టనున్నారా…? 100% చాన్సెస్ ఉన్నాయి. అజయ్ భూపతి డైరెక్షన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమాలో హీరోయిన్ గా సమంతా అనుకుంటున్నారని తెలుస్తుంది. మరి ఈ డిస్కషన్స్ ఎంత వరకు సక్సెస్ అవుతాయన్నది కరెక్ట్ గా చెప్పలేం కానీ నిజానికి ఈ రియల్ లైఫ్ కపుల్  మళ్ళీ  ఒకే సినిమాలో నటించేలా చేయడం అంత కష్టమేం కాదు. జస్ట్ కొన్ని కండిషన్స్ పాటిస్తే చాలు…

నాగ చైతన్య ఒక సినిమాకి సంతకం చేశాడంటే అనుమానం లేదు స్టోరీ డెఫ్ఫినెట్ గా కొత్తగా ఉంటుంది. ఫ్యాన్స్ సినిమా నుండి ఏదైతే ఎక్స్ పెక్ట్ చేస్తారో మ్యాగ్జిమం ఆ ఎలిమెంట్స్ ఉన్నాయనుకున్నప్పుడే ఓ సినిమా విషయంలో డెసిషన్ తీసుకుంటాడు. కానీ హీరోయిన్ రోల్ అంతగా పట్టించుకోడు. ఎందుకంటే న్యాచురల్ గానే ఆ క్యారెక్టర్ స్టోరీలో ఉండే స్కోప్ ని బట్టి ఉంటుంది. కానీ అదే రోల్ సమంతా ప్లే చేయాల్సి వస్తే…?

నాగచైతన్య సమంతా కరియర్ విషయంలో ఎంతగా ఇన్వాల్వ్ అవుతాడన్నది చెప్పలేం కానీ, సమంతా ఇమేజ్ కి తగ్గ స్కోప్ లేకపోతే  అంత ఈజీగా ఒప్పుకోదు. స్యామ్ సక్సెస్ ఫుల్ కరియర్ కి రీజనే స్టోరీ సెలెక్షన్స్.

అల్టిమేట్ గా చెప్పాలంటే ఏ హీరోయిన్ చేసినా నడుస్తుంది… అనే కంటే ఈ సినిమాలో నాగచైతన్య సరసన సమంతా అయితేనే వర్కవుట్ అవుతుంది అనే రేంజ్ లో స్క్రిప్ట్ డిమాండ్ చేయాలి. అప్పుడే ఈ జోడీ మరోసారి  సిల్వర్ స్క్రీన్ పై కనిపిస్తుంది. స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు అజయ్ భూపతి ఈ కండిషన్స్ ని మైండ్ లో పెట్టుకునే ఉంటాడు.. అందుకే అంత కాన్ఫిడెంట్ గా సమంతాని అప్రోచ్ అయి ఉంటాడు.