మహేష్ బాబు తర్వాత ఇప్పుడు శర్వా...

Saturday,August 24,2019 - 10:30 by Z_CLU

రీసెంట్ గా రైతు బ్యాక్ డ్రాప్ లో ‘మహర్షి’ చేశాడు మహేష్ బాబు. ఓ వైపు స్టైలిష్ సక్సెస్ ఫుల్ C.E.O. గా కనిపించినా అసలు కథ రైతులతో ముడిపడిందే. అయితే శర్వా కూడా ఇప్పుడు అలాంటి సినిమానే చేయబోతున్నాడు. కాకపోతే ఈ సినిమాలో శర్వా ఫుల్ టైమ్ రైతుగానే కనిపిస్తాడట.

గతంలో కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ‘శతమానంభవతి’ చేశాడు శర్వానంద్. ఆ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు కిశోర్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాలో మళ్ళీ అవే అందమైన పొలాలు.. ఎమోషన్స్ మధ్య కనిపించబోతున్నాడు ఈ హీరో.

ప్రస్తుతం ‘96’ రీమేక్ తో బిజీగా ఉన్న ఈ హీరో, ఏ మాత్రం బ్రేక్ తీసుకోకుండా ‘శ్రీకారం’ సెట్స్ పైకి రావాలనే ఆలోచన ఉన్నాడు. హైదరాబాద్, అనంతపురం, తిరుపతి లో ఈ సినిమాని చిత్రీకరించే ప్లానింగ్ లో ఉన్నారు మేకర్స్. 14 రీల్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి మిక్కీ. జె.మేయర్ మ్యూజిక్ కంపోజర్.