కైరా అద్వానీ.. ఇప్పుడు ఆలియా..?

Friday,June 28,2019 - 12:03 by Z_CLU

ఏ హీరోయిన్ అయినా ఒక్క మెగాహీరో సరసన చాన్స్ దొరికిందంటే మెగా కాంపౌండ్ లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చినట్టే… ఆ తరవాత రాబోయే మిగతా మెగా హీరో సినిమాలో కూడా ఈజీగా అవకాశం దొరికిపోతుంది. కానీ రీసెంట్ గా చెర్రీ సరసన ‘వినయ విధేయ రామ’ లో నటించిన కైరా అద్వానీ విషయంలో ఈ రూల్ బ్రేకయింది.

ఈ సినిమా తరవాత మళ్ళీ తెలుగు సినిమా చేయలేదు కైరా. బేసిగ్గా ప్యాన్ ఇండియా హీరోయిన్ అనిపించుకోవాలి అని టార్గెట్ పెట్టుకున్న ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం బాలీవుడ్ పైనే గట్టిగా దృష్టి పెడుతుంది. ఏది ఏమైనా కైరా అద్వానీ ఒక మెగాహీరో సరసన కనిపించిన మళ్ళీ ఇంకో మెగా హీరో సినిమాలో నటించలేదు… అయితే ఈ వరసలో ఇప్పుడు ఆలియా భట్ కూడా చేరనుందా…?

‘RRR’ లో చెర్రీ సరసన నటిస్తుంది ఆలియా భట్. అయితే ఈ బాలీవుడ్ భామ ఫ్యూచర్ లో మరో మెగా హీరో సరసన నటిస్తుందా..? లేకపోతే జస్ట్ RRR కోసమే టాలీవుడ్ ఎంట్రీ… అనిపించుకుని బ్యాక్ టు బాలీవుడ్ అంటుందా..?

రాజమౌళి అంటే బాలీవుడ్ లో కూడా భారీ క్రేజ్ ఉంది. ఓ రకంగా అలియాభట్ ‘RRR’ లో నటించడానికి ఎగ్జైటెడ్ అయిందంటే అది రాజమౌళి వల్లే.. కాకపోతే ఆలియాభట్ మైండ్ లో ఏం నడుస్తుందనేది ఇప్పట్లో చెప్పడం కష్టమే. టాలీవుడ్ లో సినిమాలు కంటిన్యూ చేయాలనుకుంటే మరో మెగాహీరో సరసన సినిమా చాన్స్ ఉంటుంది… లేకపోతే కష్టమే..