ఆ సినిమా తర్వాత ఎన్టీఆర్ తోనే ?

Sunday,August 26,2018 - 02:09 by Z_CLU

త్వరలోనే మెగాస్టార్ తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు కొరటాల శివ.. ప్రస్తుతానికి ఈ స్టార్ డైరెక్టర్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడు. సైరా షూటింగ్ పూర్తవ్వగానే కొరటాల డైరెక్షన్ లో చిరు నటించే సినిమా సెట్స్ పై రానుంది. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ తో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు కొరటాల.

‘జనతా గ్యారేజ్’ తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే.. అయితే ప్రస్తుతం కొరటాల చిరుతో నెక్స్ట్ సినిమా కమిట్ అవ్వడం, తారక్ కూడా త్రివిక్రమ్ , రాజమౌళిల డైరెక్షన్ లతో సినిమాలు చేస్తుండటంతో ఈ బ్లాక్ బస్టర్ కాంబోకి ఇంకాస్త టైం పట్టేలా ఉంది.

అయితే చిరు సినిమా తర్వాత కొరటాల కచ్చితంగా తారక్ సినిమానే టెక్ అప్ చేస్తాడని సమాచారం. తారక్ కూడా త్రివిక్రమ్ , రాజమౌళి సినిమాల తర్వాత కొరటాల శివకే ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.