Ram Charan నెక్స్ట్ అదే ?

Tuesday,February 21,2023 - 12:49 by Z_CLU

After Buchibabu movie, Ram Charan team up with Narthan ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో RC15 అనే భారీ బడ్జెట్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజీలో ఉంది. తర్వాత బుచ్చి బాబు డైరెక్షన్ లో ఓ స్పోర్ట్స్ డ్రామా సినిమా చేయబోతున్నాడు చరణ్. ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. త్వరలోనే ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకొచ్చే ప్లానింగ్ లో ఉన్నాడు చరణ్.

బుచ్చి బాబు సినిమా తర్వాత కన్నడ డైరెక్టర్ నర్తన్ కి చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. RC17 గా ఈ సినిమా రానుందని టాక్. ఈ కాంబో సినిమాను యూవీ క్రియేషన్స్ బేనర్ పై వంశీ ,ప్రమోద్ నిర్మించనున్నారు. ఎప్పటి నుండో యూవీ సంస్థ చరణ్ తో సినిమా నిర్మించాలని చూస్తుంది. ఫైనల్ గా ఇప్పుడు కాంబో సెట్ అయిందని సమాచారం.

త్వరలోనే చరణ్ (Ram Charan) శంకర్ సినిమాను కంప్లీట్ చేయనున్నాడు. ఆ వెంటనే బుచ్చి బాబు మూవీ ను సెట్స్ పైకి తీసుకొచ్చి ఆ తర్వాత నర్తన్ తో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉంది.

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics