స్మాల్ గ్యాప్ ... స్పీడ్ పెంచేశారు...

Sunday,March 24,2019 - 10:02 by Z_CLU

టాలీవుడ్ లో కొందరు హీరోలు స్మాల్ గ్యాప్ తీసుకొని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ ప్లాన్ చేసుకుంటున్నారు… కొన్ని నెలలు ఫ్యాన్స్ ను వెయిటింగ్ మోడ్ లో పెట్టి బ్యాక్ టు బ్యాక్ అనౌన్స్ మెంట్స్ తో  ఫుల్ ఖుషీ చేస్తున్నారు. అలా స్మాల్ గ్యాప్ తీసుకొని స్పీడ్ పెంచి సినిమాలు చేస్తున్న హీరోలపై ‘జీ సినిమాలు’ స్పెషల్ స్టోరీ.


ఈ లిస్టు లో ముందున్నాడు స్టైలిష్ స్టార్… నా పేరు సూర్య తర్వాత కొన్ని నెలల పాటు నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఫ్యాన్స్ వెయిట్ చేయించాడు. కొన్ని ఫంక్షన్స్ లో బన్నీ నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ అడిగినప్పుడల్లా ప్లీజ్ వెయిట్ అంటూ చెప్పుకొచ్చాడు. చిన్న గ్యాప్ తర్వాత ఎట్టకేలకు రెండు సినిమాలను అనౌన్స్ చేసాడు. త్రివిక్రమ్ తో సినిమా అనౌన్స్ అయిన కొన్ని రోజులకే సుకుమార్ తో మరో సినిమాను అనౌన్స్ చేసాడు బన్నీ. ఈ రెండే కాదు మరో రెండు సినిమాలు కూడా ఫైనలైజ్ చేసుకునే పనిలో ఉన్నాడట. కాకపోతే వాటి అనౌన్స్ మెంట్ మాత్రం ఇప్పుడే ఉండదని తెలుస్తోంది.


‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా విడుదలై చాలా నెలలైంది. ఆ సినిమా తర్వాత చిన్న బ్రేక్ తీసుకున్న రానా ఈ గ్యాప్ లో రెండు సినిమాలు ప్లాన్ చేసుకున్నాడు. అందులో ఒకటి ‘హాతీ మేరీ సాథీ’.. హిందీ -తెలుగు భాషల్లో ఒకేసారి తెరకెక్కనుంది ఈ సినిమా.. అలాగే గుణ శేఖర్ తో ‘హిరణ్య’ అనే మరో భారీ బడ్జెట్ సినిమా కూడా ఫైనల్ చేసుకున్నాడు. త్వరలోనే ‘హాతీ మేరీ సాథీ’కి సంబంధించి మరో షెడ్యుల్ లో పాల్గొననున్న రానా ‘హిరణ్య’ సినిమాను కూడా త్వరలోనే అనౌన్స్ చేసి వీలైనంత త్వరగా సెట్స్ పైకి తీసుకురావాలని చూస్తున్నాడు.


గోపి చంద్ కూడా కొన్ని నెలల పాటు బ్రేక్ తీసుకొని ఓ రెండు కథలు సెలెక్ట్ చేసుకున్నాడు. అందులో తిరు డైరెక్షన్ లో చేస్తున్న సినిమా ఒకటి… ఇంకొకటి కూడా ఫైనల్ చేసేసుకున్నాడు. తిరు తో చేస్తున్న సినిమాకు సంబంధించి మరో షెడ్యుల్ పూర్తయ్యాక తదుపరి సినిమాను అనౌన్స్ చేస్తాడని తెలుస్తోంది.


‘శ్రీనివాస కళ్యాణం’ తర్వాత నెక్స్ట్ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్ డేట్ ఇవ్వకుండా కొన్ని నెలలు నెట్టేసిన నితిన్ ఎట్టకేలకు రెండు సినిమాలను ఫైనల్ చేసుకున్నాడు. లేటెస్ట్ గా చంద్ర శేఖర్ ఏలేటి తో నెక్స్ట్ సినిమా అంటూ అనౌన్స్ చేసిన నితిన్ ఇదే నెలలో తన పుట్టిన రోజు సందర్భంగా వెంకీ కుడుములతో చేయబోయే సినిమాను కూడా అనౌన్స్ చేయబోతున్నాడు. ఈ రెండు సినిమాలను ఒకే టైంలో ఫినిష్ చేసి ఇదే ఏడాదిలో రిలీజ్ చేయాలని భావిస్తున్నాడు నితిన్.

వరుసగా మూడు పరాజయాలు పలకరించడంతో సాయి ధరం తేజ్ కి గ్యాప్ తీసుకోక తప్పలేదు.. వచ్చే నెల ‘చిత్రలహరి’ తో థియేటర్స్ లోకి రాబోతున్న ఈ మెగా సుప్రీం హీరో నెక్స్ట్ మారుతీ డైరెక్షన్ లో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడని తెలుస్తోంది.. ఇది కాకుండా మరో సినిమాను కూడా ఫైనల్ చేసుకున్నాడని… ‘చిత్రలహరి’ రిలీజ్ అవ్వగానే ఈ రెండు సినిమాలను ఒకటి తర్వాత ఒకటి ప్రకటిస్తాడని సమాచారం.


మొదటి సినిమా నుండి సినిమా -సినిమాకు  కొన్ని నెలల  గ్యాప్ తీసుకుంటూ వస్తున్న అఖిల్ ఈసారి రెండు సినిమాలను అనౌన్స్ చేసి కెరీర్ ని స్పీడప్ చేసే ప్లాన్ లో ఉన్నాడని తెలుస్తోంది. బొమ్మరిల్లు భాస్కర్ తో గీతా ఆర్ట్స్ లో నెక్స్ట్ సినిమాను చేయబోతున్న అఖిల్ సత్య పినిశెట్టి తో కూడా ఓ సినిమా చేయనున్నాడు. ఈ రెండు సినిమాలను ఫాస్ట్ ఫేజ్ లో ఫినిష్ చేసి మిగతా  ప్రాజెక్ట్ పై శ్రద్ధ పెడతాడట.

రాజ్ తరుణ్ కూడా స్మాల్ గ్యాప్ తర్వాత బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం దిల్ రాజు బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్న ఈ యంగ్ హీరో మరో ప్రాజెక్ట్ కూడా సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ రెండు సినిమాల తర్వాత చేయబోయే  కథలు ఫైనల్ చేసుకునే పనిలో ఉన్నాడు.