తొమ్మిదేళ్ళ తర్వాత

Thursday,April 11,2019 - 10:00 by Z_CLU

కెరీర్ స్టార్టింగ్ లోనే ‘భీమిలి కబడ్డీ జట్టు’ అనే ఓ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ సినిమా చేసాడు నాని. ఆ సినిమా విడుదలై ఇప్పటికి తొమ్మిదేళ్ళయింది.  మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత   స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో ‘జెర్సీ’ సినిమా చేసాడు. ‘భీమిలి కబడ్డీ జట్టు’ లో కబడ్డీ ప్లేయర్ గా నటించిన నాని ఇప్పుడు ‘జెర్సీ’ కోసం క్రికెటర్ అవతారమెత్తాడు.

కెరీర్  ప్రారంభంలోనే  ‘భీమిలి కబడ్డీ జట్టు’ లాంటి క్రీడా నేపథ్యం ఉన్న సినిమా చేసి నటుడిగా మంచి మార్కులు అందుకొన్నాడు నాని. ఆ తర్వాత మళ్ళీ ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయాలని చూసాడు. కానీ అలాంటి కథ తన దగ్గరికి రాకపోవడంతో వచ్చిన కథలే చేస్తూ వెళ్ళాడు. ఇంతకాలానికి గౌతం రూపంలో నాని దగ్గరికి మళ్ళీ ఓ స్పోర్ట్స్ బేస్డ్ స్క్రిప్ట్ వచ్చింది. అందుకే విన్న వెంటనే ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు నేచురల్ స్టార్.

నిజానికి సినిమాలో క్రికెట్ అనేది ఒక పార్ట్ మాత్రమే… సినిమాలో ఇంకా సర్ప్రైజ్ ఉందంటూ ఇటివలే చెప్పాడు నాని . సో కథలో క్రికెట్ అనేది ఒక భాగమే అయినా సినిమా అంతా క్రికెట్ చుట్టూనే తిరుగుతుందని తెలుస్తోంది. మరి తొమ్మిదేళ్ళ తర్వాత మళ్ళీ స్పోర్ట్స్ మెన్ గా కనిపించిన నాని ‘జెర్సీ’ తో ఏ రేంజ్ హిట్ సాదిస్తాడో చూడాలి.