'2 స్టేట్స్' కోల్ కతా షెడ్యూల్
Sunday,June 03,2018 - 10:25 by Z_CLU
అడవిశేష్, శివానీ రాజశేఖర్ హీరో హీరోయిన్లుగా లక్ష్య ప్రొడక్షన్స్ పై తెరకెక్కుతున్న సినిమా `2 స్టేట్స్` (వర్కింగ్ టైటిల్ ). చేతన్ భగత్ రాసిన నవల `2 స్టేట్స్` ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా ఇటివలే సెకండ్ షెడ్యూల్ ఫినిష్ చేసుకుంది.
రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ కోల్‌కత్తాలో ఏకధాటిగా 15 రోజులు జరిగింది. ఈ నెల 7 నుంచి మూడో షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో స్టార్ట్ చేయబోతున్నారు.
వెంకట్ కుంచం ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎంఎల్‌వి సత్యనారాయణ (సత్తిబాబు) నిర్మాత.