'గూఢచారి' సీక్వెల్ రెడీ అవుతుంది

Sunday,November 11,2018 - 12:12 by Z_CLU

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన ‘గూఢచారి’ సినిమా ఈ ఏడాది బెస్ట్ మోవీస్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే… ఈ సినిమా చివర్లో సీక్వెల్ రాబోతుందని క్లారిటీ ఇచ్చిన టీం ఇప్పుడు ఆ సీక్వెల్ ను రెడీ చేసే పనిలో బిజీ అయింది. అయితే ఈ పార్ట్ 2 కి దర్శకుడి పేరు మారబోతుంది. ‘గూఢచారి’ సినిమా రైటింగ్ లో కీ రోల్ ప్లే చేసిన రాహుల్ పాకాల ఈ సీక్వెల్ ను డీల్ చేయబోతున్నాడని సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ వర్క్ పూర్తయినట్టు తెలుస్తుంది.

పార్ట్ 1 లో ఉన్న నటీ నటులతో పాటు మరికొందరు కొత్త నటులు కూడా ఈ సీక్వెల్ లో కనిపిస్తారని టాక్.. ప్రస్తుతం 2 స్టేట్స్ సినిమాతో బిజీ గా ఉన్న అడివి శేష్ త్వరలోనే గూఢచారి 2 ను సెట్స్ పైకి తీసుకురావాలని భావిస్తున్నాడు.