ఇదే నెలలో.. పెద్ద ప్రాజెక్ట్ తో రాబోతున్నాడు

Sunday,August 25,2019 - 01:20 by Z_CLU

సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘ఎవరు’ తో తన ఖాతాలో మరో సూపర్ హిట్ వేసుకున్నాడు అడివి శేష్. ఈ సక్సెస్ ఇచ్చిన ఉత్సాహంతో నెక్స్ట్ ‘మేజర్’ సినిమా చేయబోతున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోగ్రఫీగా తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ‘గూఢచారి’ ఫేం శశి కిరణ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. అక్టోబర్ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.

సోనీ పిక్చర్స్ , జీ మహేష్ బాబు ఎంటర్తైన్మెంట్స్ బ్యానర్స్ పై హిందీ , తెలుగు  భాషల్లో  తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్ట్ 15 న రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అంటే వచ్చే ఏడాది సరిగ్గా ఇదే నెలలో మళ్ళీ అడివి శేష్ మేజర్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరి ఈ సినిమాతో శేష్ ఏ రేంజ్ హిట్ అందుకుంటాడో చూడాలి.