HIT2 రిలీజ్ డేట్ లాక్

Monday,May 02,2022 - 02:03 by Z_CLU

Adivi Sesh’s ‘HIT 2’ release date locked

జూన్ 3న తన ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ ‘మేజర్’ తో థియేటర్స్ లోకి రాబోతున్న యంగ్ హీరో అడివి శేష్ తాజాగా మరో సినిమా రిలీజ్ డేట్ లాక్ చేసుకున్నాడు. శైలేష్ కొలను దర్శకత్వంలో శేష్ ‘HIT (The second Case)’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. జులై 29 ఈ సినిమా థియేటర్స్ లోకి రానున్నట్లు లేటెస్ట్ పోస్టర్ రిలీజ్ చేసి ప్రకటించారు.

విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ తెరకెక్కించిన HIT (The First Case ) మంచి విజయం అందుకుంది. దానికి సీక్వెల్ గా కేస్ 2 అంటూ ఈ సినిమా రూపొందుతుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను వాల్ పేపర్ సినిమా బేనర్ పై నాని సమర్పణలో ప్రశాంతి తిపిర్నేని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ ఫినిష్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమాలో అడివి శేష్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics