అమెరికాలో "గూఢచారి" షూటింగ్

Wednesday,February 28,2018 - 06:00 by Z_CLU

“క్షణం” లాంటి ట్రెండ్ సెట్టింగ్ హిట్ అనంతరం అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం “గూఢచారి”. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ సమకూర్చగా.. మిస్ ఇండియా మరియు తెలుగమ్మాయి అయిన శోభిత ధూళిపాళ్ళ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ అమెరికాలో జరుగుతోంది.

ఈ సందర్భంగా నిర్మాతలు అభిషేక్ నామా – టిజి విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్  మాట్లాడుతూ.. “ఇప్పటివరకూ తెలుగుతెరపై చూడని సరికొత్త కాన్సెప్ట్ తో “గూఢచారి” తెరకెక్కుతోంది. డిల్లీ, పూణే, హైద్రాబాద్, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, చిట్టగాంగ్ (బంగ్లాదేశ్ లలో చిత్రీకరణ జరుపుకొన్న ఈ చిత్రం తాజా షెడ్యూల్ ప్రస్తుతం అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్స్ లో జరుగుతోంది. అక్కడి అందమైన, అత్యద్భుతమైన లొకేషన్స్ లో అడివి శేష్ షూట్ చేస్తున్నారు. అడివి శేష్ ఈ చిత్రంలో ఒక స్పై పాత్రలో కనిపించనున్నారు. హై టెక్నికల్ వేల్యూస్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఒక సరికొత్త సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ను ఇస్తుంది. వేసవి కానుకగా “గూఢచారి” చిత్రాన్ని విడుదల చేయనున్నాం” అన్నారు.

ప్రొడక్షన్ డిజైన్: శివం రామ్

ఎడిటర్: గ్యారీ బీహెచ్

సినిమాటోగ్రఫీ: షానిల్ డియో

మాటలు: అబ్బూరి రవి

సంగీతం: శ్రీచరణ్ పాకాల

సహ నిర్మాత: వివేక్ కూచిభోట్ల

నిర్మాతలు: అభిషేక్ నామా – టిజి విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్

కథ: అడివి శేష్

దర్శకత్వం: శశికిరణ్ తిక్క