అడివి శేష్ గూడచారి... నెక్స్ట్ అక్కడే

Sunday,May 13,2018 - 09:31 by Z_CLU

అడివి శేష్ హీరోగా నటిస్తున్న  ‘గూఢచారి’ ఇటివలే యు.ఎస్ లో షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.. ఆ షెడ్యూల్ తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్న యూనిట్ ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ లో నెక్స్ట్ షెడ్యుల్ ప్లాన్ చేస్తుంది. ఇప్పటికే డిల్లీ, పూణే, హైద్రాబాద్, కాకినాడ, రాజమండ్రి, వైజాగ్, చిట్టగాంగ్ (బంగ్లాదేశ్) లలో  కొంత వరకూ షూట్ చేసిన యూనిట్ ఇటివలే అమెరికాలోని కాస్కేడ్ మౌంటైన్స్ లో ఓ షెడ్యుల్ ఫినిష్ చేసారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నేతృత్వంలో అభిషేక్ పిక్చర్స్-విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు శశికిరణ్ తిక్క దర్శకుడు. అడివి శేష్ ఈ చిత్రానికి కథ అందించగా.. మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తుంది. సమ్మర్ లోనే ఈ సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ ఉన్నారు మేకర్స్.