మార్చి 24 న అఫీషియల్ గా లాంచ్ కానున్న ‘2 స్టేట్స్’ రీమేక్

Tuesday,March 13,2018 - 07:04 by Z_CLU

హిందీ సూపర్ హిట్ మూవీ 2 స్టేట్స్ మూవీ తెలుగులో రీమేక్ కానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకున్న ఈ సినిమా, ఎట్టకేలకు మార్చి 24 న అఫీషియల్ గా లాంచ్ కానుంది. అడివి  శేష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ కానుంది.

చేతన్ భగత్ రాసిన ‘2 స్టేట్స్’ బుక్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అల్టిమేట్ యూత్ ఫుల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కనున్న ఈ సినిమా, తెలుగులోను అదే రేంజ్ క్రేజ్ క్రియేట్ చేస్తుందని కాన్ఫిడెంట్ గా ఉన్నారు ఫిల్మ్ మేకర్స్.

వెంకట్ రెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి MLV సత్యనారాయణ ప్రొడ్యూసర్. లక్ష్య ప్రొడక్షన్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.