Adivi Sesh Major - రిలీజ్ వాయిదా

Wednesday,May 26,2021 - 01:58 by Z_CLU

అడివి శేష్ హీరోగా శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మేజర్’ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమాను విడుదల చేయలేమని భావించిన మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జులై 2 న ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోన సెకండ్ వేవ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉండటం ఇప్పుడే పరిస్థితులు చక్కబడేలా కనిపించకపోవడంతో వాయిదా వేసుకున్నారు. త్వరలోనే మరో కొత్త రిలీజ్ డేట్ ప్రకటించనున్నట్లు తెలిపారు.

ఇటివలే విడుదలైన మేజర్ టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. తెలుగు , హిందీ భాషల్లో ఏక కాలంగా తెరకెక్కిన ఈ సినిమాతో బాలీవుడ్ లో హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు శేష్. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆదరంగా 200 ముంబై ఎటాక్ సంఘటన నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. పరిస్థితులు చక్కబడితే ఆగస్ట్ 15న స్వాతంత్ర దినోత్సవం కానుకగా ఈ సినిమాను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ .

Major movie Adivi Sesh

సోనీ పిక్చర్స్, A+S మూవీస్ తో కలిసి GMB ఎంటర్టైన్ మెంట్స్ బేనర్ పై మహేష్ బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. శ్రీచరణ్ పాకాల బ్యాక్ గ్రౌండ్ ఇస్తున్నారు ఈ సినిమా అడివి శేష్ స్క్రీన్ ప్లే అందించాడు. అబ్బూరి రవి తెలుగు వర్షన్ కి అక్షత్ అజయ్ శర్మ హిందీ వర్షన్ కి డైలాగ్స్ అందిస్తున్నారు.

  •  Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics