అడివి శేష్ ఇంటర్వ్యూ

Wednesday,August 01,2018 - 05:08 by Z_CLU

అడివి శేష్ ‘గూఢచారి’ ఈ నెల 3 న గ్రాండ్ గా రిలీజవుతుంది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా అడివి శేష్ RAW ఏజెంట్ లా నటించాడు. రెగ్యులర్ స్పై థ్రిల్లర్ లా కాకుండా ఈ సినిమా ఇమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అని చెప్తున్న అడివి శేష్ ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు రివీల్ చేశాడు అవి మీకోసం…

ఇప్పుడా ఫీలింగ్ లేదు…

ఏ సినిమా చేసినా ఒక రకమైన నర్వస్ ఫీలింగ్ ఉండేది. ఈ సినిమాకు ఆ ఫీలింగ్ లేదు… జెన్యూన్ గా చాలా  కాన్ఫిడెంట్ గా ఉన్నాను.

అదే ఫిక్సయ్యాం…

గూఢచారి అనే టైటిల్ పెట్టగానే హాలీవుడ్ సినిమాలతో కంపల్సరీగా కంపేర్ చేస్తారు. మేం ఫిక్సయింది ఏంటంటే జేమ్స్ బాండ్ సినిమా చేయకూడదు, జేసన్ బార్న్ సినిమా అంతకన్నా చేయకూడదు.. ఈ సినిమా ఎవరు చూసినా ఇది నా కథ అనుకోవాలి.

అదే సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్…

గూఢచారి బ్యాక్ డ్రాప్ లో ఉండే సినిమాలన్నీ ఒకేలా ఉంటాయి. కానీ ఒక ట్రైన్డ్ ‘గూఢచారి’ ఏం చేశాడు అనేకంటే అసలు ఒక సాధారణ వ్యక్తి గూఢచారి ఎలా అయ్యాడు అనేదే ఈ సినిమాలో ఇంట్రెస్టింగ్ పాయింట్.

కృష్ణ గారిని అడిగాం…

ఈ సినిమాలో కామియో చేయమని సూపర్ స్టార్ కృష్ణ గారిని అడిగాను… ‘లేదు నేనింకా నటించట్లేదు… కావాలంటే నా సినిమాలో నుండి ఏవైనా సీన్స్ వాడుకోండి’ అన్నారు.. ఇంకా అప్పుడు సార్ మీ టైటిల్ వాడేసుకుంటాం అన్నాము.

R.A.W. గురించి…

 ఈ సినిమా చేసే ప్రాసెస్ లో R.A.W. గురించి తెలుసుకున్నాను. అసలు R.A.W. అనే సంస్థ పని చేసేది దేశం కోసమే అయినా, దేశానికి బయట ఉండి చేస్తాయి. దేశం కోసం వీళ్ళు ఏమైనా చేసేస్తారు. డైరెక్ట్ గా ప్రైమ్ మినిస్టర్ కే రిపోర్ట్ చేస్తారు. అది ఇండియన్ కాన్స్ టిట్యూషన్ పరిధిలోకి రాదు.

‘కిస్’ కి ముందు ‘కిస్’ కి తరవాత…

‘కిస్’ సినిమా తరవాత ఒక విషయం రియలైజ్ అయ్యాను. నేను నా సినిమాలకు డైరెక్షన్ చేయకూడదు. ఏ సినిమా చేసినా మనసుకు నచ్చిందే చేయాలి.

ఫైట్స్ అన్నీ ఆ ఫార్మాట్ లోనే…

‘క్రావ్ మాగా’ అనేది మిలిటరీ సెల్ఫ్ డిఫెన్స్ ఫైటింగ్ సిస్టమ్. అయితే గూఢచారి సినిమా కోసం మేము అ టెక్నిక్స్ ని రీసర్చ్ చేసి ఆ ఫార్మాట్ లోనే యాక్షన్ సీక్వెన్సెస్ తెరకెక్కించాం.

 

రియలిస్టిక్ గా ఉంటాయి…

క్రావ్ మాగా ట్రైనింగ్ ప్రాసెస్.. హీరో ఆ టెక్నిక్స్ ని నేర్చుకోవడం లాంటి సీక్వెన్సెస్ చాలా రియలిస్టిక్ గా ఉంటాయి.

ఇంట్రెస్టింగ్ పాయింట్…

లై డిటెక్టర్ అనేది ఒక మనిషి నిజం చెప్తున్నాడా..? అబద్ధం చెప్తున్నాడా తెలుసుకోవడానికి వాడతారు. అయితే ‘క్రావ్ మాగా’ ట్రైనింగ్ సిస్టమ్ లో అలాంటి లై డిటెక్టర్ కూడా దొరికిపోకుండా ఎలా అబద్ధం చెప్పాలో ట్రైనింగ్ ఇస్తారు. ఆ ప్రాసెస్ మీరీ సినిమాలో చూస్తారు.

బెస్ట్ ఆల్బమ్…

శ్రీచరణ్ పాకాల ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో ‘గూఢచారి’ బెస్ట్ ఆల్బమ్ అవుతుంది.

ఇప్పుడే నో డైరెక్షన్…

ఒక పెద్ద స్టార్ నాకు ఆఫర్ కూడా ఇచ్చారు డైరెక్షన్ చేయమని… కానీ నేను అనుకుంటున్న స్టాండర్డ్స్ లో సినిమా చేయాలంటే చాలా బ్రిలియంట్ గా ఉండాలి.. ఆ స్థాయికి నేను ఎదగలేదు అని నా ఫీలింగ్..

అదీ సంగతి…

168 లొకేషన్స్, 116 రోజుల షూటింగ్ డేస్… 3 డిఫెరెంట్ కంట్రీస్, U.S. లో స్నో స్ట్రామ్ లో -20 డిగ్రీ వెదర్ లో షూట్ చేశాం. హిమాలయాల్లో ప్రకాష్ రాజ్ గారితో యాక్షన్ ఎపిసోడ్స్ , కాకినాడ పోర్ట్ నుండి 20 Km ల డీప్ ఓషన్ లో షిప్ మీద యాక్షన్ ఎపిసోడ్, బంగ్లాదేశ్ లోని ధాకా, చిట్టగాంగ్ లో యాక్షన్ ఎపిసోడ్స్… ఇవన్నీ జస్ట్ ఒక్క సినిమా లోనే.. గూఢచారి లో మీరు చూడబోతున్నారు.

నెక్స్ట్ సినిమాలు…

2 స్టేట్స్ సగం షూటింగ్ కంప్లీట్ అయింది… PVP బ్యానర్లో ఒక సినిమా చేస్తున్నాను.  ఈ సినిమాతో రామ్ జీ అని కొత్త డైరెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, దీంతో పాటు మా ఫ్యామిలీ ఫ్రెండ్ ఒకరు డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు ఆయనతో సినిమా చేయబోతున్నా… ఇవి కాకుండా ఇంకా కొన్ని స్టోరీస్ వింటున్నా.