అమెరికాలో అడివి శేష్ గూఢచారి

Wednesday,February 21,2018 - 10:03 by Z_CLU

అడివి శేష్ ‘గూఢచారి’ ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం అమెరికాలోని ఎగ్జోటిక్ లొకేషన్ లలో షూటింగ్ జరుపుకుంటుంది. రీసెంట్ గా రిలీజైన ఈ మూవీ ఫస్ట్ లుక్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేసింది.

గతంలో ‘క్షణం’ లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్ తో ఇంప్రెస్ చేసిన అడివి శేష్, ఈ సినిమా కూడా అదే రేంజ్ లో ఎట్రాక్ట్ చేయడం గ్యారంటీ అని కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ప్రస్తుతం సినిమాలోని కీలక సన్నివేశాలను తెరకెక్కించే పనిలో ఉన్న ఫిల్మ్ మేకర్స్ సమ్మర్ లో  ఈ సినిమాను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు.

ఈ సినిమాతో మిస్ ఇండియా శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అవుతుంది. శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని అభిషేక్ నామా, T.G. విశ్వ ప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శ్రీచరణ్ పాకాల ఈ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.