RAW ఏజెంట్ గా మారిన అడివి శేష్

Wednesday,July 04,2018 - 06:35 by Z_CLU

అడివి శేష్ ‘గూఢచారి’ ఆగష్టు 3 న రిలీజ్ అవుతుంది. ఇంట్రెస్టింగ్ స్పై థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమా టీజర్ సమంతా చేతుల మీదుగా ఈ రోజే రిలీజయింది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసిన ఫిల్మ్ మేకర్స్ రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ ఈ సినిమా ప్రమోషన్ ప్రాసెస్ స్పీడ్ పెంచేశారు.

ఈ సినిమాలో అడివి శేష్ RAW ఏజెంట్ గా కనిపించనున్నాడు. టీజర్ ని బట్టి ఎలివేట్ అవుతున్న టెక్నికల్ స్టాండర్డ్స్ తో పాటు టీజర్ బిగినింగ్ లో ఉన్న కాన్వర్జేషన్ ని బట్టి, RAW ఏజెంట్ గా దేశానికి సేవలందించిన తన తండ్రిని చూసి ఇన్స్ పైర్ అయిన హీరో, RAW ఏజెంట్ గా మారిన తరవాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తాడు..? దేశాన్ని ఎలాంటి సమస్యల నుండి కాపాడతాడు అనేదే సినిమాలో కీ ఎలిమెంట్.

మోస్ట్ స్టైలిష్ థ్రిల్లర్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అడివి శేష్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్స్ లో ప్రెజెంట్ చేస్తున్నాడు దర్శకుడు శశికిరణ్ తిక్క. ప్రకాష్ రాజ్ కీ  రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో శోభిత దూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి అభిషేక్ నామా ప్రొడ్యూసర్.