లైన్ క్లియర్ చేసుకున్న గూఢచారి

Monday,July 30,2018 - 06:14 by Z_CLU

స్లిక్ సస్పెన్స్ థ్రిల్లర్ లా తెరకెక్కింది అడివి శేష్ గూఢచారి. అయితే ఆగష్టు 3 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా ఫాస్ట్ పేజ్ లో రిలీజ్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకునే పనిలో పడింది. ఇప్పటికే  U/A సర్టిఫికెట్ తో ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ క్లియర్ చేసుకుంది ఈ సినిమా.

దానికి తోడు సినిమాలో హీరో బ్యాక్ స్టోరీ ఇప్పటికే ఆడియెన్స్ లో సినిమాపై క్యూరియాసిటీ లెవెల్స్ ని పెంచేస్తుంది. అసలీ అర్జున్ ఎవరు..? అడివి శేష్ ఈ సినిమాలో ప్లే చేసిన రియల్ రోల్ ఏంటనే క్వశ్చన్స్ ఇప్పటికే ఆడియెన్స్ లో రేజ్ అయి ఉన్నాయి. స్టైలిష్ యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు, ఇన్వెస్టిగేటివ్ సస్పెన్స్ సీక్వెన్సెస్ సినిమాలో హైలెట్ కానున్నాయి.

శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో అడివి శేష్ సరసన  శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటించింది. శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజర్. ఈ సినిమాని T.G. విశ్వప్రసాద్, అభిషేక్ నామా, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మించారు.