అడివి శేష్ ఇమోషనల్ స్పీచ్ – రేపే గూఢచారి రిలీజ్

Thursday,August 02,2018 - 12:44 by Z_CLU

గూఢచారి సినిమా చుట్టూ చాలా పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి. చాలా ప్రోగ్రెసివ్ ఎలిమెంట్స్ స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా రేపు గ్రాండ్ గా రిలీజ్ అవుతుంది. ఈ సందర్భంగా ఈ సినిమాని మూవీ లవర్స్ కి మరింత చేరువ చేసే ప్రాసెస్ లో నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంది సినిమా యూనిట్. ఈ సందర్భంగా అడివి శేష్ ఈ సినిమా కథ ఎలా పుట్టింది..? అనే పాయింట్ దగ్గరి నుండి ఈ సినిమాకి పని చేసిన టీమ్ వరకు ఇమోషనల్ గా మాట్లాడాడు.

“ఈ కథ ఎప్పుడో 2004 లో రాసుకున్నా. ‘క్షణం’ సక్సెస్ తరవాత ఇంకో మంచి సినిమా తీయాలి అని అభిషేక్ గారు అన్నప్పుడు ఆ కథను తీసుకెళ్ళి శశికిరణ్ కి ఇచ్చా. శశికిరణ్ స్టోరీ చదివి బాలేదని సింపుల్ గా చెప్పేశాడు. అప్పుడు మళ్ళీ నేను, శశి, రాహుల్, అబ్బూరి రవి కలిసి ఆ మూలకథకి అద్బుతమైన స్ట్రక్చర్ ఇచ్చాం…” అని చెప్పుకున్నాడు.

ఈ సినిమాలో శోభిత దూలిపాళ్ళ అడివి శేష్ సరసన హీరోయిన్ గా నటించింది. హీరోయన్ క్యారెక్టర్ సినిమాలో క్రియేట్ చేసే ఇంపాక్ట్ ఎలా ఉండబోతుందో గెస్  చేయడం కష్టం కానీ నిన్నటి ఈవెంట్ లో అడివి శేష్ రివీల్ చేసిన దాని ప్రకారం శోభిత ఈ సినిమాలో సైకలాజి మేజర్ లా కనిపించనుంది. సుప్రియ తో పాటు వెన్నెల కిషోర్ ఈ సినిమాలో కీ రోల్స్ ప్లే చేస్తున్నారు.

శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని అభిషేక్ నామా, T.G. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. శశికిరణ్ తిక్క ఈ సినిమాకి డైరెక్టర్.