బిగ్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాను - అడివి శేష్

Saturday,August 04,2018 - 01:29 by Z_CLU

‘క్షణం’ వంటి సూపర్ హిట్ చిత్రం తరువాత అడివి శేష్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గూఢచారి’.శోభిత ధూళిపాళ్ల హీరోయిన్ గా అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, విస్టా డ్రీం మర్చెంట్స్ బ్యానర్స్ పై శశి కిరణ్ తిక్క దర్శకత్వంలో అభిషేక్ నామ, టిజి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్ సంయుక్తంగా గూడాచారి చిత్రాన్ని నిర్మించారు.  టేకింగ్, మేకింగ్ పరంగా  హాలీవుడ్ చిత్రాలకి ధీటుగా హైటెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రములో జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సుప్రియ, రవిప్రకాష్, మధు షాలిని ముఖ్యపాత్రల్లో నటించారు.  ఏ కె ఎంటర్ టైన్మెంట్స్ ద్వారా ఆగష్టు ౩న వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం రిలీజ్ అయిన ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ తో యునానిమస్ హిట్ టాక్ తో  రన్ అవుతోంది.

ఈ సందర్భంగా హీరో అడివి శేష్ మాట్లాడుతూ”- సినిమా చూసిన ప్రతి ఒక్కరూ దెగ్గరికి వచ్చి హగ్ చేసుకుంటున్నారు. ఇది నా ఫైవ్ ఇయర్స్ కృషి..బుక్ మై షో యాప్ లో కూడా 96% పర్సెంట్ టికెట్స్ ఎక్స్ ట్రార్డినరీ గా ఫుల్స్ అయ్యాయి. వైజాగ్ లో చిన్నప్పుడు నేను త్రీ ఇయర్స్ వున్నాను.ఆ టైంలో జగదాంబ థియేటర్ లో అన్నీ సినిమాలు చూసేవాడ్ని. అలాంటిది ఇప్పుడు నా సినిమా అదే థియేటర్లో హౌస్ ఫుల్ అవడం బిగ్ అచీవ్మెంట్ గా భావిస్తున్నాను. శశి ఫెంటాస్టిక్ గా ఈ సినిమా తీసాడు. శ్రీ చరణ్  మ్యూజిక్, కెమెరా వర్క్ కి చాలా పేరు వచ్చింది.అబ్బూరి రవి నాకోసం పంజా చిత్రం లో మంచి క్యారెక్టర్, డైలాగ్స్ రాసారు.అలాగే క్షణం లో కూడా మంచి డైలాగ్స్ ఇచ్చారు.ఈ రెండు చిత్రాలు నా కెరీర్ ఎదుగుదలకి చాలా హెల్ప్ అయ్యాయి.ఇప్పుడు గూఢచారి కి ఎక్స్ లెంట్ డైలాగ్స్ రాసారు.ఈ మూడు చిత్రాలు నాకు చాలా మంచి పేరు తెచ్చాయి అన్నారు.