మహేష్ బాబుపై 'సమ్మోహనం' ఎఫెక్ట్

Friday,June 22,2018 - 02:01 by Z_CLU

సుధీర్ బాబు హీరోగా నటించిన సమ్మోహనం సినిమా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా నడుస్తోంది. ఈ సినిమాను ప్రత్యేకంగా చూసిన మహేష్ బాబు.. హీరోహీరోయిన్లతో పాటు టోటల్ యూనిట్ ను మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. అయితే ఇదేదో ఫార్మాలిటీగా జరిగిన వ్యవహారం కాదు. సమ్మోహనం సినిమా నిజంగానే మహేష్ పై ప్రభావం చూపించింది. ఎంతలా అంటే అందులో నటించిన అదితి రావును తన సినిమాలో హీరోయిన్ గా తీసుకోవాలని ఫిక్స్ అయ్యాడట మహేష్.

సమ్మోహనం సినిమాలో అదితిని అద్భుతంగా చూపించాడు దర్శకుడు ఇంద్రగంటి. ఈమెలో ఇంత అందం దాగుందా అని అంతా ఆశ్చర్యపోయే రేంజ్ లో ఓ దేవతలా సిల్వర్ స్క్రీన్ పై ఆమెను ప్రజెంట్ చేశాడు. ఆ అందం మహేష్ ను కూడా ఎట్రాక్ట్ చేసింది. అందుకే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమాలో ఆమెకు సెకెండ్ హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడట.

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ ఓ సినిమా చేస్తున్నాడు. ఫస్ట్ షెడ్యూల్ ప్రస్తుతం డెహ్రాడూన్ లో నడుస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. సెకెండ్ హీరోయిన్ గా అదితిని తీసుకోవాలని అనుకుంటున్నారట.