Aditi Rao - మహాసముద్రంలో మరో బ్యూటీ

Monday,October 12,2020 - 01:17 by Z_CLU

మహాసముద్రం ప్రాజెక్టుకు సంబంధించి ఒక్కొక్కటిగా అప్ డేట్ ఇస్తూ వస్తోంది యూనిట్. ఇందులో భాగంగా ఈరోజు మరో అప్ డేట్. ఈ సినిమాలో హీరోయిన్ గా అదితిరావును తీసుకున్నారు. ఈ మేరకు కొద్దిసేపటికిందట ఎనౌన్స్ మెంట్ వచ్చేసింది.

నిజానికి Aditi Rao పేరు చాన్నాళ్లుగా వినిపిస్తోంది. దాన్ని ఇప్పుడు అఫీషియల్ గా ఎనౌన్స్ చేశారు.

MahaSamudram సినిమాకు సంబంధించి ముందుగా శర్వానంద్ పేరును, తర్వాత సిద్దార్థ్ పేరును రివీల్ చేశారు. ఇప్పుడు అదితిరావు పేరును ప్రకటించారు. మరో హీరోయిన్ పేరును త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు. బహుశా అది రాశిఖన్నా కావొచ్చు.

ALSO READ – బొమ్మరిల్లు హీరో రీఎంట్రీ

వైజాగ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా రాబోతోంది మహాసముద్రం. ఆర్ఎక్స్100 తో ఇమేజ్ తెచ్చుకున్న అజయ్ భూపతి, రెండేళ్లు కష్టపడి ఈ కథ రాసుకున్నాడు. ఏకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై అతి త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి రాబోతోంది.