సమంత, కీర్తిసురేష్.. ఇప్పుడు అదితిరావు

Thursday,May 17,2018 - 12:15 by Z_CLU

ఈమధ్య హీరోయిన్లంతా సొంతంగా డబ్బింగ్ చెప్పుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మహానటి, అజ్ఞాతవాసి లాంటి సినిమాల్లో కీర్తిసురేష్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. అజ్ఞాతవాసిలో అను ఎమ్మాన్యుయేల్ కూడా సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది. మహానటిలో సమంత కూడా డబ్బింగ్ చెప్పుకుంది. ఇప్పుడీ లిస్ట్ లోకి తాజాగా అదితిరావు కూడా చేరిపోయింది.

సుధీర్‌బాబు, అదితీరావు జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ నిర్మిస్తోన్న‌ చిత్రం `స‌మ్మోహ‌నం`. జూన్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ మూవీలో అదితిరావు అసలైన గొంతును వినబోతున్నాం. అవును.. అదితి తన పాత్రకు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంది.

రొమాన్స్, కామెడీ మిక్స్ చేసి ఇంద్రగంటి ఈ సినిమాను తెరకెక్కించాడు. అదితి అందాలతో పాటు పి.జి.విందా సినిమాటోగ్ర‌ఫీ, వివేక్ సాగ‌ర్ సంగీతం, రవీందర్ ఆర్ట్ వర్క్ సినిమాకు హైలెట్ కానున్నాయి.