'ఆది పినిశెట్టి' ఇంటర్వ్యూ

Thursday,August 23,2018 - 05:37 by Z_CLU

ఓ వైపు హీరోగా… మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెస్మరైజ్ చేస్తూ కెరీర్ ను కొనసాగిస్తున్న ఆది పినిశెట్టి ‘నీవేవరో’ సినిమాతో రేపే థియేటర్స్ లోకి రానున్నాడు…. హరినాథ్ డైరెక్షన్ లో సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందిన ‘నీవెవరో’ రేపటి నుండి థియేటర్స్ లో సందడి చేయనున్న సందర్భంగా ఆది పినిశెట్టి మీడియాతో ముచ్చటించాడు. ఆ విశేషాలు ఆది మాటల్లోనే.

 

సినిమా చూస్తే తెలిసిపోతుంది

ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు ‘నీవెవరో’ అనే టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది. నిజానికి ప్రతీ మనిషికి ఇతరుల గురించి తెలియనప్పుడు నీవెవరో అంటూ తెలుసుకోవాలని ఉంటుంది. సినిమాలో ప్రతీ క్యారెక్టర్ ను నీవెవరో అంటూ అడుగుతున్నట్లుగా కథ నడుస్తుంది.. నేను ప్లే చేసిన కళ్యాణ్ క్యారెక్టర్ అయితేనేమి, రితిక ప్లే చేసిన అను క్యారెక్టర్ అయితేనేమి తాప్సీ వెన్నెల క్యారెక్టర్ గానీ ఇలా ప్రతీ క్యారెక్టర్ నీవెవరో అనేలా ఉంటాయి. రేపు సినిమా చూస్తే అదేంటనేది ప్రేక్షకులకు తెలిసిపోతుంది.

రియల్ ఇన్సిడెంట్స్ తో

వెరీ వెరీ ప్రాక్టికల్ మూవీ. ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న రియల్ ఇన్సిడెంట్స్ కి బేస్ చేసుకొని తెరకెక్కించిన సినిమా. సినిమా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటూనే అందరికీ బాగా కనెక్ట్ అవుతుంది.

తమిళ్ సినిమా రీమేక్..కానీ

‘అదే కంగల్’ అనే తమిళ్ సినిమాను బేస్ చేసుకొని అందులో మెయిన్ సోల్ తీసుకొని చేసిన సినిమా ఇది. నిజానికి అది చాలా మంచి పాయింట్. అందుకే తెలుగు ప్రేక్షకులకు కూడా ఆ పాయింట్ కచ్చితంగా నచ్చుతుందనే రీమేక్ చేయడం జరిగింది. ఆ పాయింట్ తీసుకొని తెలుగు ప్రేక్షకులకు నచ్చేలా అల్లిన సినిమా ఇది. పాయింట్ అదే కానీ సన్నివేశాలలో చాలా మార్పులుంటాయి.

ఛాలెంజింగ్ క్యారెక్టర్

నటుడిగా చాలా క్యారెక్టర్స్ చేసాను కానీ నాకు నిజంగా ఛాలెంజింగ్ అనిపించిన క్యారెక్టర్ ఇది. ఈ సినిమా సైన్ చేసాక ఒక నెల పాటు గ్యాప్ దొరికింది. ఆ గ్యాప్ లో బ్లైండ్ క్యారెక్టర్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నాను. ఒక నార్మల్ క్యారెక్టర్ చేసేయడం చాలా ఈజీ. వాటికి బౌండరీస్ ఉండవు కానీ బ్లైండ్ క్యారెక్టర్ అలా కాదు దానికి 100 శాతం బౌండ రీస్ ఉంటాయి. ఆ క్యారెక్టర్ తో ప్రేక్షకులకు కన్విన్స్ చేయడం చాలా కష్టం… సినిమా చూస్తున్నంత సేపు నిజంగానే వీడు బ్లైండ్ ఆ ? అనే ఫీల్ తీసుకురావాలి అప్పుడే ఆ క్యారెక్టర్ కి మనం బెస్ట్ ఇచ్చినట్టు. అందుకే కళ్యాణ్ క్యారెక్టర్ ని ఛాలెంజింగ్ గా తీసుకొని ప్రతీ రోజు హోమ్ వర్క్ చేస్తూ సినిమా చేయడం జరిగింది.

ఆ సినిమా నాకు డిక్షనరీ

ఈ సినిమాలో కళ్యాణ్ క్యారెక్టర్ చేయడానికి కొన్ని సినిమాలు కలెక్ట్ చేసి చూసాను. అందులో ఆల్ పచినో నటించిన ‘సెంట్ ఆఫ్ ఎ విమెన్’ అనే సినిమా నాకు డిక్షనరీలా ఉపయోగాపడింది. బ్లైండ్ సినిమాల్లో బెంచ్ మార్క్ సినిమాలా దాన్ని పెట్టుకున్నాను. ఆ సినిమా చూస్తున్నంత సేపు ఆయనొక హీరో అని మర్చిపోయాను. ఆయన బ్లైండ్ క్యారెక్టర్ లో అంతలా ఇమిడిపోయారు. ఆ సినిమాలో ఆయన రోల్ ను ఆదర్శంగా తీసుకున్నాను. అలాగే కొందరు బ్లైండ్ స్టూడెంట్స్ ను కూడా కలిసి ఇంట్లో హోం వర్క్ చేసుకున్నాను. అలాగే చెన్నైలో ఒక బ్లైండ్ స్కూల్ కెళ్ళి వాళ్ళకు బుక్స్ చదివి వినిపించే వాడిని. ఆ టైంలో వాళ్ళ హావభావాలను బాగా గమనించాను. బ్లైండ్ లో కూడా కొన్ని రకాలు ఉంటాయని అప్పుడే తెలిసింది.

మేనేజ్ చేయదలుచుకోలేదు

బ్లైండ్ క్యారెక్టర్ అనగానే కూలింగ్ గ్లాసెస్ పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు కాని నేను అలా చేయ దలుచుకోలేదు. సినిమాలో కళ్యాణ్ కి 15 ఇయర్స్ అప్పుడు కళ్ళు పోతాయి. కళ్ళు కంప్లీట్ గా డామేజ్ అవుతాయి. అలా జరిగినప్పుడు వాళ్లకి ఎండ వెలుగు లాంటివాటి నుండి ఎఫెక్ట్ ఉండదు. కొందరు బ్లైండ్ పీపుల్ గ్లాసెస్ పెట్టుకోరు. అందుకే సినిమాలో నేనెక్కడా గ్లాస్ పెట్టుకొని కనిపించను.

నా క్కొంచెం తిక్కుంది

హీరోగా సినిమాలు లేకే క్యారెక్టర్స్ చేస్తున్నాడని… ఆ క్యారెక్టర్స్ కి వచ్చిన రెస్పాన్స్ తోనే మళ్ళీ హీరోగా చేస్తున్నాడని కొందరు అనుకుంటున్నారు. నిజానికి ఆ విషయంపై నేనొక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. హీరోగా ఎప్పుడూ సినిమాలు ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.. డైరెక్టర్స్ అప్రోచ్ అవుతూనే ఉన్నారు.. కానీ నాక్కొంచెం తిక్కుంది.. ఏదైనా నాకు పర్ఫెక్ట్ అనిపించే స్క్రిప్ట్ అనిపించాలి. ఆ ఫిలిం మేకర్ కి టెక్నికల్ గా కేపబిలిటీ ఉండాలి ..ఆ తర్వాత మంచి నిర్మాత ఉండాలి… అందుకే హీరోగా సినిమాలు చేసే ముందు ఇవన్నీ చూసుకుని సెలెక్ట్ చేసుకుంటాను. ప్రేక్షకులకు హీరోగా ఓ క్వాలిటీ సినిమా ఇవ్వాలనుకుంటాను.. ఆ విషయంలో తగ్గేది లేదు.

అందుకే ఆ క్యారెక్టర్స్ చేశా

హీరోగా ‘మలుపు’ సినిమా విజయం సాదించిన తర్వాత వరుసగా క్యారెక్టర్స్ చేసాను. ‘సరైనోడు’,’నిన్ను కోరి’,’రంగస్థలం’,’యూ టర్న్’ ఇలా నేను క్యారెక్టర్స్ ప్లే చేసిన సినిమాల్లో నేను కనిపించను ఆ క్యారెక్టర్స్ మాత్రమే కనిపిస్తాయి. అందుకే ఆ క్యారెక్టర్స్ చూస్ చేసుకొని చేసాను. క్యారెక్టర్ గా కనిపించే అలాంటి సినిమాలొస్తే ఎప్పుడూ సిద్దమే.

అదే నా టార్గెట్

హీరోగా చేసినా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసినా నా టార్గెట్ ఒక్కటే.. చేసిన ప్రతీ క్యారెక్టర్ తో నటుడిగా మంచి గుర్తింపు అందుకోవాలి. ప్రతీ సారి అదొక్కటే ఆలోచిస్తుంటాను. నటుడిగా అదే నా గోల్. క్యారెక్టర్ ఏదైనా దానికి బెస్ట్ ఇవ్వలనుకుంటాను.

టెన్షన్ ఉంది…

హీరోగా సినిమా చేసినప్పుడు రిలీజ్ టైంలో టెన్షన్ మాములే. కాకపోతే ఇది రిమేక్ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ టెన్షన్ ఉంది. సినిమా చూసిన వాళ్ళు కొందరు ఎక్కడా బోర్ కొట్టలేదని . ఇప్పటి వరకూ చూడని కథని. ఎమోషనల్ గా ఫీలయ్యామని చెప్తున్నారు. రేపు ప్రేక్షకులు కూడా అదే చెప్తే హీరోగా సూపర్ హ్యాపీ.

క్యారెక్టర్సే కనిపిస్తాయి

సినిమాలో నేను ఇంపార్టెంట్, తాప్సీ ఇంపార్టెంట్, అలా ఉండదు. నిజానికి సినిమాలో మేమెవ్వరం కనిపించం కేవలం క్యారెక్టర్జేషన్ మత్రమే కనిపిస్తాయి. సినిమాలో అందరూ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ప్లే చేసారు. ముఖ్యంగా తాప్సీ ఈ క్యారెక్టర్ చేయడం సినిమాకు కలిసొచ్చింది.

జడ్జ్ చేయలేను

సినిమా పరంగా, నా క్యారెక్టర్ పరంగా కేర్ తీసుకోగలను కానీ సినిమాని జడ్జ్ చేయలేను. ఆ విషయంలో ఎక్కువ మట్టికి ఇతరులపైనే ఆదారపడతాను. మొదటి నాలుగు రోజులు కూడా నా క్యారెక్టర్ గురించి అందరినీ పిలిచి మరీ అడిగేవాణ్ణి. సినిమా విషయంలో నా ఒపినియన్ అస్సలు నమ్మను.

చాలా పెద్ద సినిమలొచ్చాయి

‘వైరం ధనుష్’ క్యారెక్టర్ చేసిన తర్వాత నేటీవ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ చేయమని పెద్ద ఆఫర్స్ వచ్చాయి. ‘సింఘం3’ లో కూడా మెయిన్ విలన్ గా అడిగాను. నటుడిగా నేను చేసిన క్యారెక్టర్ ను మళ్ళీ వెంటనే రిపీట్ చేయకూడదనుకుంటాను. అందుకే ఆ విషయంలో కాస్త గట్టిగా ఉన్నాను. మళ్ళీ నాకు ఇంట్రెస్టింగా అనిపించే అలాంటి రోల్ వస్తే కచ్చితంగా చేస్తాను.

బ్యాలెన్స్ చేయగలగాలి

తమిళ్ , తెలుగు రెండు భాషల్లో సినిమాలు చేయడం నిజానికి రెండు పడవలమీద ప్రయాణం లాంటిది . సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతే నీళ్ళల్లో పడిపోతాం. ఆ విషయంలో నాకో క్లారిటీ ఉంది. ఆ క్లారిటీతో నటుడిగా రెండు లాంగ్వేజెస్ ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నా.

డైరెక్టర్ బాగా డీల్ చేసాడు

డైరెక్టర్ హరినాథ్ సినిమాను చాలా బాగా డీల్ చేసారు. ఎలాంటి సీన్ అయినా ఆయన చాలా కూల్ గా రిలాక్స్ గా డీల్ చేస్తూ సినిమాను కంప్లీట్ చేసారు. ఈ సినిమా తర్వాత ఆయనకీ మంచి పేరు వస్తుందని భావిస్తున్నా.

‘ఆర్ ఎక్స్ 100’ రీమేక్ చేస్తున్నా

ఇటివలే తెలుగులో మంచి హిట్ సాదించిన ‘ఆర్ ఎక్స్ 100’ ను తమిళ్ లో రీమేక్ చేస్తున్నా. ఆ సినిమాకు సంబంధించి టెక్నిషియన్స్ డీటెయిల్స్ లాగే ఆర్టిస్టుల డీటెయిల్స్ త్వరలోనే వెల్లడిస్తా. సినిమా చేస్తున్నానని తెలియకుండా చూసాను.

నాన్న వెరీ హ్యాపీ

నాన్న ఎప్పుడూ ఎన్ని సినిమాలు సైన్ చేసావ్ అని అడగరు..ఆయన అడిగేదల్లా ఎన్ని మంచి కథలు విన్నావ్ అని మాత్రమే. నేను చేసిన ప్రతీ క్యారెక్టర్ గురించి ఆయన స్పందన తీసుకుంటాను. నా క్యారెక్టర్ గురించి ప్రతీసారి ఏదో చెప్తూ చాలా హ్యాపీ గా ఫీలవుతారు. నా విషయంలో నాన్న వెరీ హ్యాపీ.