Bheemla Nayak - నాలుగో పాట రిలీజ్

Saturday,December 04,2021 - 02:20 by Z_CLU

Adavi Talli Maata song from Pawan’s Bheemla Nayak Released

సాంగ్స్ తో హల్ చల్ చేస్తోంది భీమ్లానాయక్. టైటిల్ సాంగ్ తో పాటు ఇప్పటికే 3 పాటలు రిలీజ్ అయ్యాయి. అన్నీ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇదే ఊపులో Bheemla Nayak మూవీ నుంచి నాలుగో పాటను కూడా రిలీజ్ చేశారు.

అడవి తల్లి అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను రామజోగయ్య శాస్త్రి రాయగా తమన్ సంగీతం అందించాడు.. సాహితి చాగంటి, దుర్గవ్వ ఈ పాటను ఆలపించారు. సినిమా థీమ్ ను ఎలివేట్ చేస్తూ, అక్కడక్కడ కథను కూడా చెబుతూ ఈ సాంగ్ ను కంపోజ్ చేశారు.

పవన్‌కల్యాణ్‌, రానా హీరోలుగా సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. త్రివిక్రమ్‌ ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నాడు. తమన్‌ సంగీత దర్శకుడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాను.. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

మలయాళంలో ఘన విజయం సాధించిన ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’ చిత్రానికి రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. సినిమాలో పవన్ కల్యాణ్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రానా పక్కన సంయుక్త మీనన్ హీరోయిన్. రవి.కె.చంద్రన్ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్.