హీరోయిన్ ప్రీతి అశ్రాని ప్రధాన పాత్రలో "A"

Thursday,May 07,2020 - 01:17 by Z_CLU

అవంతిక ప్రొడక్షన్స్ ‘A” (AD-INFINITUM) చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని టైటిల్ పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. మళ్ళీ రావా చిత్రంతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ప్రీతి అశ్రాని ప్రెజర్ కుక్కర్ సినిమాతో మంచి మార్కులు కొట్టేసింది. ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో ఆమె నటించింది.

ఇదొక మెడికల్ థ్రిల్లర్. 1977 – 2019 మధ్య కాలంలో జరిగిన ఫిక్షన్ కథతో ఈ సినిమా వస్తోంది. హాలీవుడ్ లో కూడా రానటువంటి ఒక విభిన్నమైన కథ తో “A” (AD-INFINITUM)“ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటున్నారు మేకర్స్.

ఈ చిత్రానికి పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ ఫిలిం స్కూల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చారు. థ్రిల్లర్ జానర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులకు ఈ చిత్రం కొత్త అనుభూతిని ఇస్తుందంటోంది యూనిట్.