SuperStar Krishna లేడీ సూపర్ స్టార్ ఎమోషనల్ పోస్ట్

Wednesday,November 16,2022 - 11:15 by Z_CLU

Actress Vijayashanthi shares emotional Post on social media about Super Star Krishna

సూపర్ స్టార్ కృష్ణ (Superstar Krishna) గారితో నటించిన చాలా మంది తోటి నటీ నటులు నిన్న కృష్ణ గారి పార్ధీవ దేహానికి శ్రద్దాంజలి ఘటిస్తూ మహేష్ కుటుంబ సభ్యులను పరామర్శించారు. చాలా మంది సోషల్ మీడియాలో కృష్ణ గారి గురించి ఎమోషనల్ పోస్టులు పెట్టారు. ఒకప్పటి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కూడా  కృష్ణ గారి గురించి తన అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఓ ఎమోషనల్ పోస్ట్ ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు.

ఈ అమ్మాయి మరీ చిన్న బిడ్డలా… నాకు కూతురిలాగా ఉంటది నిర్మలా…” అని, మీరు విజయనిర్మల గారితో అంటే… “నాకు తెలుసు, తను పెద్ద హీరోయిన్ అవుతుంది” అని 1980లో ఆంటీ అన్న మాట… నా తొలి చిత్రం కిలాడీ కృష్ణుడు సమయంలో ఒక చక్కటి జ్ఞాపకం.

సూపర్ స్టార్ అయిన మీతో ఆ తర్వాత ఎన్నో హిట్స్, సూపర్‌హిట్స్. ఆ “కిలాడీ కృష్ణుడు” నుండి “ఒసే రాములమ్మ” వరకూ ఎన్నో సినిమాలలో కళాకారులుగా కలసి పనిచెయ్యగలిగాం… ఇప్పుడిక వెళ్లిపోయిన ఆంటీతో పాటు మీరు కూడా… అపురూపమైన జ్ఞాపకం… సెలవిక సూపర్ స్టార్ కృష్ణ గారు...” అంటూ విజయశాంతి ట్వీట్ చేశారు.

 

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics