Ma Neella Tank రీఎంట్రీ ఇస్తోన్న ప్రియా ఆనంద్
Wednesday,July 06,2022 - 03:52 by Z_CLU
Actress Priya Anand Re-entry with ‘Maa neella tank’ series
శేఖర్ కమ్ముల- రానా దగ్గుబాటి కాంబినేషన్లో రూపొందిన లీడర్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ ప్రియా ఆనంద్. ఆ సినిమాలో తన అందం, అభినయంతో చలనచిత్ర పరిశ్రమలో మంచి స్థానం సంపాదించుకుంది. ఆ తర్వాత రామ రామ కృష్ణ కృష్ణ, కో అంటే కోటి, 180 సినిమాలతో నటిగా మెప్పించింది. కొంత గ్యాప్ తర్వాత ఈ భామ మళ్లీ తన అభిమానుల్ని అలరించనుంది.
‘వరుడు కావలెను’ సినిమాతో మంచి హిట్ సాధించిన లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో ‘మా నీళ్ల ట్యాంక్’ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో రూపోందుతున్న వెబ్ సిరీస్ లో నటిస్తోంది ప్రియా ఆనంద్. ఒక చిన్న గ్రామంలో పనికిరాని వాటర్ ట్యాంక్ చుట్టూ నడిచే కథతో, సరదా సరదా సన్నివేశాలతో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కింది. జీ5 సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సుశాంత్ సబ్ ఇన్ స్పెక్టర్‌గా నటిస్తుండగా, పల్లెటూరు అమ్మాయిగా ప్రియా ఆనంద్ కనిపిస్తోంది.
మొత్తం ఎనిమిది ఎపిసోడ్స్‌గా రూపుదిద్దుకుంటున్న ఈ వెబ్ సీరిస్ జులై 15 నుంచి జీ 5లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఈ వెబ్ సిరీస్ కోసం ప్రియా సొంతంగా డబ్బింగ్ చెప్పింది. ఈ టీజర్లో ప్రియా ఆనంద్ నటనను దర్శకుడు విక్రమ్ కె కుమార్ మెచ్చుకోవడం విశేషం.
-
Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics