ప్రభాస్ తల్లిగా "ప్రేమ పావురాలు" హీరోయిన్?

Friday,January 24,2020 - 02:45 by Z_CLU

ప్రేమ పావురాలు సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది భాగ్యశ్రీ. అప్పట్లో కుర్రాళ్ల కలలరాణి ఈమె. ఇప్పుడీమె టాలీవుడ్ లో అడుగుపెట్టింది. ప్రభాస్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. లేటెస్ట్ గాసిప్స్ ప్రకారం, ప్రభాస్ కు తల్లిగా కనిపించనుందట భాగ్యశ్రీ.

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో కనిపిస్తానని అంటోంది భాగ్యశ్రీ. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేసిన ఈమె, ఈ సినిమా కోసం వేసిన సెట్స్ అద్భుతంగా ఉన్నాయంటోంది. భూమిపై స్వర్గాన్ని తలపించేలా సెట్స్ ఉన్నాయంటోంది. ప్రేక్షకులు కూడా సినిమాలో సెట్స్ చూసి చాలా కొత్తగా ఫీల్ అవుతారంటోంది.

ఇక సినిమా గురించి మాట్లాడుతూ, ఇందులో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉంటుందంటోంది. తన క్యారెక్టర్ చూసి ఆడియన్స్ వావ్ అంటారని అంటోంది.