త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వేద

Friday,October 04,2019 - 12:41 by Z_CLU

హీరోయిన్ వేద అలియాస్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. నిన్న ఆమె ఎంగేజ్ మెంట్ గ్రాండ్ గా జరిగింది. ఓ హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది వేద. హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో వీళ్ల నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది.

తపన అనే సినిమాతో వెండితెరకు పరిచయమైంది అర్చన. ఆ సినిమా నుంచే ఆమె వేదగా మారింది. అలా ఓ 10 సినిమాలు చేసిన తర్వాత, వేద పేరు స్థానంలో తన ఒరిజినల్ పేరుతోనే నటించడం స్టార్ట్ చేసింది. ఖలేజా, బలుపు, లయన్, పరమ వీర చక్ర, నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలతో వేదకు మంచి గుర్తింపు వచ్చింది.

రీసెంట్ గా సప్తగిరి హీరోగా వచ్చిన వజ్రకవచధర సినిమాలో నటించింది వేద. అందులో నెగెటివ్ షేడ్స్ ఉన్న లేడీ విలన్ గా మంచి పాత్ర పోషించింది. కాకపోతే సినిమా ఫ్లాప్ అవ్వడంతో ఆమెకు పెద్దగా గుర్తింపురాలేదు.