వెన్నెల కిషోర్ కు తీవ్ర గాయాలు

Thursday,August 04,2016 - 01:33 by Z_CLU

 

స్టార్ కమెడియన్ వెన్నెల కిషోర్ కు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు రెండు కాళ్లు విరిగిపోయాయి. హాస్పిటల్ లో ఉన్న తన ఫొటోను వెన్నెల కిషోర్ స్వయంగా అప్ లోడ్ చేశాడు. కానీ చాలా హ్యాపీగా ఉన్నాడు. ఇది రియల్ గా జరిగిన ఇన్సిడెంట్ కాదు. తాజాగా సూపర్ హిట్ అయిన జెంటిల్ మేన్ సినిమాలోని ఫొటో ఇది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్ క్యారెక్టర్ పేరు దర్శనం. ఈ రోల్ ను ఎవరూ మర్చిపోలేరు. సీరియస్ గా సాగే సినిమాలోకి ఫన్నీగా ఎంటరైన దర్శనం క్యారెక్టర్… ఎంత మేజిక్ చేసిందో అందరికీ   తెలిసిందే. నాని హీరోగా నటించిన ఈ సినిమా తాజాగా 50రోజులు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఆ సినిమాలోని ఈ స్టిల్ ను వెన్నెల కిషోర్ పోస్ట్ చేశాడు. సినిమా యూనిట్ కు కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేశాడు.