Actor Sunil - భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీ

Saturday,October 30,2021 - 11:12 by Z_CLU

Actor Sunil busy with big projects

చాన్నాళ్ళ పాటు కమెడియన్ గా సినిమాలు చేసిన సునీల్ తర్వాత ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా మారాడు. ఆ తర్వాత రెండు మూడు హిట్లు కొట్టి తర్వాత వరుస అపజయాలు అందుకొని ఇప్పుడు విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయ్యాడు. ప్రస్తుతం చిన్న సినిమాల్లో క్యారెక్టర్స్ పెద్ద సినిమాల్లో విలన్ గా నటిస్తూ ఫుల్ బిజీ అయిపోయాడు.

ప్రస్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాలో ఓ నెగిటివ్ క్యారెక్టర్ చేస్తున్నాడు సునీల్. ఆల్మోస్ట్ పార్ట్ 1 అంతా సునీలే విలన్ కనిపిస్తాడని అంటున్నారు. ఇక సినిమాలో ఓ మంచి పాత్ర చేశానని చెప్పుకున్నాడు కూడా. ఇక రామ్ చరణ్ -శంకర్ సినిమాలో కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో శంకర్ సినిమాల్లో హీరో పక్కన ఉండే కమెడియన్ లా కనిపిస్తాడా ? లేదా ఏదైనా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నాడా ? తెలియాలి.

వీటితో పాటు మెగా స్టార్ చిరు నటిస్తున్న మెగా ప్రాజెక్ట్ ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఓ రోల్ చేస్తున్నాడు సునీల్. ఈ విషయాన్ని ఇటివలే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు.  అటు పెద్ద సినిమాలు ఇటు చిన్న సినిమాలతో నటుడిగా ఫుల్ బిజీ అయిపోయాడు. మరో వైపు OTT లో వెబ్ మూవీస్ , సిరీస్ లు కూడా వదలకుండా క్యారెక్టర్ ఉంది అని అప్రోచ్ అయిన అన్నీ చేసుకుంటూ వెళ్తున్నాడు. తాజాగా ‘హెడ్స్ అండ్ టేల్స్’ అనే వీబ్ మూవీలో కూడా నటించాడు.  మరి బడా సినిమాల్లో డిఫరెంట్ గా కనిపించబోతున్న సునీల్ వీటితో నటుడిగా మరింత బిజీ అయిపోతాడో చూడాలి.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics